ఆ ఫెయిర్‌నెస్ క్రీముతో నా కిడ్నీలూ దెబ్బతిన్నాయి: మలయాళ గాయకుడు సలీం కోడత్తూర్!

తెల్లగా మారిపోవాలి, అందంగా కనిపించాలి అనే ఆశతో ఆన్‌లైన్ ప్రకటనలు, ఇతరుల మాటలు నమ్మి ఫెయిర్‌నెస్ క్రీములు వాడుతున్న వారికి మలయాళ ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సలీం కొడత్థూర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పారు.. కేరళలోని మలప్పురం జిల్లాలో ఇన్‌స్టాగ్రామ్ వీడియో చూసి ఒక ఫెయిర్‌నెస్ క్రీము వాడిన 17 ఏళ్ల బాలిక శరీరంలోకి పాదరసం చేరి తీవ్రమైన కిడ్నీ వ్యాధి బారినపడిన ఘటన ఇటీవల కలకలం రేపింది.

ఈ నేపథ్యంలో ఆదివారం మీడియా ముందుకు వచ్చిన సలీం, గతంలో తాను కూడా ఒక స్నేహితుడి సలహాతో ఇలాంటి బ్యూటీ క్రీము వాడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నానని వెల్లడించారు. క్రీము వాడటం మొదలుపెట్టిన కొన్ని నెలల్లోనే తన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైందని సలీం వివరించారు. ముందుగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు రావడంతో పాటు కనురెప్పలు, కాళ్లలో వాపులు కనిపించాయని, రోగ నిరోధక శక్తి పూర్తిగా పడిపోయిందని తెలిపారు.

Kidney Damage with Fairness Cream Malayalam Singer Saleem Kodathoor Reveals Fairness Cream Adverse effects

వైద్య పరీక్షలు చేయించుకోగా తన శరీరంలో ఆల్బుమిన్ అనే ముఖ్యమైన ప్రొటీన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గిపోతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే కిడ్నీలు పూర్తిగా పనిచేయకుండా పోతాయని వైద్యులు హెచ్చరించినట్లు చెప్పారు. ఆసుపత్రిలో చేరి బయాప్సీ పరీక్ష చేయించుకోగా, తాను 'మెంబ్రనస్ నెఫ్రోపతి' అనే తీవ్రమైన మూత్రపిండాల వ్యాధి బారినపడినట్లు నిర్ధారణ అయిందని, ఆ తర్వాత నెలల తరబడి చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి మురళీధరన్ తీవ్రంగా స్పందించారు. ఫేస్ క్రీముల వాడకం వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఫేస్ క్రీములు, ప్రొటీన్ పౌడర్ల విక్రయాలపై విస్తృత తనిఖీలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఇలాంటి నకిలీ, ప్రమాదకర బ్యూటీ ప్రొడక్ట్స్ పొరుగు దేశమైన పాకిస్థాన్ నుంచి అక్రమంగా వస్తున్నాయని, ముఖ్యంగా మంగళూరు-కాసర్‌గోడ్ సరిహద్దు ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని మంత్రి తెలిపారు.

ఇన్‌ఫ్లుయెన్సర్ల మాట నమ్మి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడిన బాలిక.. కిడ్నీలు పాడైన ఘటన!
ఇన్‌ఫ్లుయెన్సర్ల మాట నమ్మి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడిన బాలిక.. కిడ్నీలు పాడైన ఘటన!

సాధారణంగా నాణ్యత లేని, అనుమతులు లేని ఫెయిర్‌నెస్ క్రీముల్లో చర్మాన్ని త్వరగా తెల్లగా మార్చేందుకు మోతాదుకు మించి పాదరసం , సీసం వంటి విషపూరిత రసాయనాలు మరియు స్టెరాయిడ్లను కలుపుతారని, చర్మవ్యాధి, మూత్రపిండాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం ద్వారా రక్తంలోకి చేరే ఈ పాదరసం నేరుగా కిడ్నీల వడపోత వ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో కనిపించే రంగుల ప్రకటనలు, ఎలాంటి లేబుల్ లేదా డ్రగ్ కంట్రోల్ అనుమతులు లేని క్రీములను వాడవద్దని, చర్మ సమస్యలు ఉంటే అర్హులైన డెర్మటాలజిస్టుల సలహా మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+