ఈ సారికి క్షమించి వదిలేద్దాం: రేవంత్ నిర్ణయం వెనుక..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ సైతం వారి వ్యాఖ్యల పైన ఘాటు గా స్పందిస్తున్నారు. ఈ వ్యవహారం ఏఐసీసీకి వెళ్లింది. నివేదికలు కోరటంతో చర్యలు ఏంటనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో అసమ్మతి పెరుగుతోంది. ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి సమస్య గా మారుతున్నాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ నిర్వహించిన పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, విస్తృత స్థాయి సమావేశాల్లో ఇదే అంశం కీలకంగా మారింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వంటి నేతలు ఇటీవలి కాలంలో చేసిన బహిరంగ వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని పీఏసీ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు. క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు సూచించినప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా స్పందించారు. 'ఈసారికి క్షమించి వదిలేద్దాం' అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దీని వెనుక భారీ వ్యూహమే ఉందనే చర్చ పార్టీలో మొదలైంది.

TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
TTD: పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు- టికెట్ల జారీ ఇలా, వీరికి అరుదైన అవకాశం..!!
cm-revanth-latest-remarks-on-controversial-comments-spark-debate-within-congress-details-here

రేవంత్ ప్రతిపాదన వెనుక

సిద్దిపేట సభలో రేవంత్ సైతం తనను విమర్శిస్తున్న ఎమ్మెల్యేల పై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వారిని కార్యకర్తలే ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరుస్తారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పార్టీ ముఖ్య నేతల సమావేశంలో వారిని ఈ సారి క్షమించి వదిలేద్దాం అంటూ చెప్పటం వెనుక భవిష్యత్తులో నోరు జారితే కఠిన చర్యలు తప్పవన్న గట్టి హెచ్చరిక ఉందనే విశ్లేషణలు మొదలయ్యాయి. పార్ టీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో సయోధ్య కుదుర్చుకోవడానికి కొంత అవకాశం ఇవ్వాలనేది రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. పార్టీ అంతర్గత సమస్యలను బహిరంగ వేదికలపై కాకుండా పార్టీ వేదికలపైనే చర్చించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తనపై గానీ, మంత్రులపై గానీ ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా రాష్ట్ర ఇన్‌చార్జికి తెలియజేయాలని ఆయన సూచించారు. నేతలు రహస్య సమావేశాల్లో ఏం చర్చిస్తున్నారనే పూర్తి సమాచారం పార్టీ వద్ద ఉందని వెల్లడించారు. దీంతో, రానున్న రోజుల్లో పార్టీలో చోటు చేసుకునే పరిణామాలు.. నిర్ణయాల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+