1.27 కోట్ల ప్యాకేజ్ IIT గ్రాడ్యుయేట్- పెళ్లి కూతురికి అడిగిన అర్హతలు తెలిస్తే షాక్..! ఎక్స్ లో వైరల్..!

మన దేశంలో ఐఐటీలకు ఎంత డిమాండ్ ఉందో, ఆ ఐఐటీల నుంచి వచ్చే గ్రాడ్యుయేట్లకూ అంతే డిమాండ్ ఉంటోంది. ఉద్యోగాల విషయంలోనే కాదు పెళ్లిళ్ల విషయంలోనూ వారికున్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దీన్ని వాడుకుని, ఆయా ఐఐటియన్లు పెడుతున్న వివాహ షరతులు చూస్తే దిమ్మదిరిగిపోవాల్సిందే. ఇలాంటిదే ఓ ఘటన ఢిల్లీ పొరుగున ఉన్న గురుగ్రామ్ లో చోటు చేసుకుంది. ఏడాదికి రూ.1.27 కోట్ల ప్యాకేజ్ అర్జిస్తున్న ఓ ఐఐటీ గ్రాడ్యుయేట్ (IIT Graduate) తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో నాట్ డేటింగ్ అనే ఓ మ్యాట్రిమోనియల్ బ్యూరోకు వెల్లడించాడు. దాన్ని చూసి షాకైన సదరు బ్యూరో అధినేత జస్వీర్ సింగ్ దీనిపై ఎక్స్ లో పోస్టు పెట్టాడు.

సంవత్సరానికి రూ.1.27 కోట్లు సంపాదించే ఒక వ్యక్తి, తాను గతంలో ఎప్పుడూ వినని ఒక పెళ్లి షరతుతో తమ మ్యాట్రిమోనీ బృందాన్ని సంప్రదించాడని జస్వీర్ తెలిపాడు. దానికి డబ్బు, అందం లేదా కుటుంబ సంపదతో ఎలాంటి సంబంధం లేదన్నాడు. సదరు ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఒక చిన్న పట్టణంలో పెరిగాడని, 12వ తరగతి వరకు అక్కడే చదువుకున్నాడని, ఆ తర్వాత ఒక పెద్ద నగరానికి మారాడని, అతను ఐఐటిలో చదివి విజయవంతమైన వృత్తిని నిర్మించుకున్నాడని వెల్లడించాడు. కానీ తనకు సరిపోయే భాగస్వామిని వెతుక్కోవడం మాత్రం అతనికి కష్టమైందన్నాడు.

IIT Graduate Earning Rs 1 27 Crore Seeks Woman Who Grew Up In A Small Town And Made It Big In A City

సదరు గ్రాడ్యుయేట్.. తాను దక్షిణ ఢిల్లీ, దక్షిణ బొంబాయిలోని ధనిక కుటుంబాలకు చెందిన చాలా మంది మహిళలతో డేటింగ్ చేశానని. పైకి చూస్తే, తామిద్దరం ఒకరికొకరం సరిగ్గా సరిపోయామని, కానీ నిజ జీవితంలో, ఎప్పుడూ ఏదో ఒకటి లోపించిందని చెప్పినట్లు జస్వీర్ తెలిపాడు. ఈ మహిళలు ధనిక మెట్రో కుటుంబాలలో పెరిగారని, కొందరు విదేశాలలో చదువుకుని చాలా భిన్నమైన జీవనశైలిని అనుభవించారని, అతను ఒక చిన్న పట్టణంలో పెరిగాడని, ఆదాయాలు, సామాజిక హోదా ఒకేలా ఉన్నప్పటికీ, వారి పెంపకం భిన్నంగా ఉందని జస్వీర్ పేర్కొన్నాడు. వారి సంగీత అభిరుచులు, ఆహార ప్రాధాన్యతలు, సంభాషణలు సరిపోలలేదన్నాడు. కొన్నిసార్లు, కుటుంబం, సంబంధాలు, లింగ పాత్రలపై వారి అభిప్రాయాలు కూడా భిన్నంగా ఉండేవన్నాడు.
ఆ తర్వాత అతను చిన్న పట్టణాలకు చెందిన మహిళలను కలవడానికి ప్రయత్నించాడన్నాడు.

IIT: విద్యార్థి ఆత్మహత్య- ఫ్యాన్ రాడ్లు మార్చేస్తున్న ఐఐటీ..!
IIT: విద్యార్థి ఆత్మహత్య- ఫ్యాన్ రాడ్లు మార్చేస్తున్న ఐఐటీ..!

అలాగే మరో సమస్య ఉందని, మెట్రో నగరాల్లో దశాబ్దానికి పైగా గడిపిన తర్వాత, అతని ఆసక్తులు, అంచనాలు మారిపోయాయన్నాడు. అతను వ్యాపారం, సాంకేతికత, ఆలోచనల గురించి చర్చించాలనుకున్నాడని, కానీ అతను కలిసిన కొందరు మహిళల ఆసక్తులు, సంభాషణలు అతని వాటికి చాలా భిన్నంగా ఉండేవన్నాడు. అతను రెండు ప్రపంచాల మధ్య చిక్కుకుపోయాడని జస్వీర్ వెల్లడించాడు. ధనిక మెట్రో కుటుంబాలకు చెందిన మహిళలు అతని పరిస్ధితి అర్థం చేసుకున్నారు కానీ గతాన్ని కాదన్నాడు. చిన్న పట్టణాలను విడిచి ఎన్నడూ రాని మహిళలు అతని గతాన్ని అర్థం చేసుకున్నారు కానీ వర్తమానాన్ని కాదన్నాడు. అప్పుడు అతను తనకేం కావాలో వివరించాడని, తనకు చిన్న పట్టణంలో పెరిగి, పెద్ద నగరానికి వచ్చి, గొప్ప స్థాయికి ఎదిగిన మహిళ కావాలని చెప్పినట్లు జస్వీర్ తెలిపాడు.

IITs: ఐఐటీల్లో కొత్తగా 6 వేల సీట్లు..! ఈ బ్రాంచ్ ల్లో - 2027 నుంచే..!
IITs: ఐఐటీల్లో కొత్తగా 6 వేల సీట్లు..! ఈ బ్రాంచ్ ల్లో - 2027 నుంచే..!

చదువుకున్న, ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న, విజయవంతమైన వ్యక్తి కావాలి. కానీ అన్నింటికన్నా ముఖ్యంగా, రెండు ప్రపంచాలను అనుభవించిన వ్యక్తి కావాలని చెప్పాడన్నాడు. అతను చెప్పినదాని ప్రకారం, ఇలాంటి ప్రయాణాలు చేసిన మహిళలను కలిసినప్పుడల్లా, వారు దాదాపు వెంటనే ఒకరితో ఒకరు మమేకమవుతారని, వారు అతని బాల్యాన్ని, వర్తమానాన్ని అర్థం చేసుకుంటారని, ఎందుకంటే వారు రెండింటినీ జీవించారని జస్వీర్ తెలిపాడు. అతను దీనిని తన 'రెండు దేశాల సిద్ధాంతం' అని పిలిచాడని జస్వీర్ పేర్కొన్నాడు. ఒకే దేశంలో రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలని, అతను ఆ రెండింటినీ అనుభవించిన వ్యక్తిని కోరుకుంటున్నాడని తెలిపాడు. తనకు ఆసక్తికరంగా అనిపించిన విషయం ఏమిటంటే, అతను ఒక నిర్దిష్ట జీతం, కుటుంబ సంపద లేదా సామాజిక హోదా ఉన్న వారి కోసం వెతకడం లేదన్నాడు. అతను తనలాగే జీవిత ప్రయాణం చేసిన వ్యక్తి కోసం వెతుకుతున్నాడన్నాడు. కొన్నిసార్లు, ఇద్దరి మధ్య పోలిక అనేది ప్రస్తుతం మీరు జీవితంలో ఏ దశలో ఉన్నారనే దానిపై ఆధారపడి ఉండదని; మీరు ఎక్కడ మొదలుపెట్టారు, అక్కడికి ఎలా చేరుకున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందన్నాడు. అయితే, పెళ్లి కోసం ఇది సమంజసమైన నిబంధనేనా, లేక అతను తనలాగే ఉండే ఒక స్త్రీ రూపం కోసం వెతుకుతున్నాడా? తన దగ్గర దీనికి సమాధానం లేదంటూ జస్వీర్ ఈ ట్వీట్ ముగించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+