ఈ ఆకు టీ తాగితే షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ - క్యాన్సర్ రాకుండా..!!
మధుమేహం విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతోంది. మారుతున్న ఆహారం.. మారిన జీవన శైలి.. ఒత్తిడి మధుమేహం పెరగటానికి ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. మధుమేహం నియంత్రణ కోసం వైద్యులు సూచించిన మందులను వినియోగిస్తూనే కొన్ని జాగ్రత్తలతో బయట పడవచ్చని సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో జామ ఆకు ఉపకరిస్తుంది. అదే విధంగా కొలెస్ట్రాల్ నియంత్రణ చేయటం తో పాటుగా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహం నియంత్రణకు సహాయపడేవి మనం నిత్యం వినియోగించే వాటిలో చాలా ఉన్నాయి. అందులో ఒకటి జామ ఆకులు. జామ ఆకులను తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తున్నారు. జామపండులో ఫైబర్, విటమిన్ సి, యాంటీ హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయ పడుతుంది. జామ ఆకుల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. మధుమేహాన్ని పూర్తిగా నయం చేయడం కష్టం. అయితే, మందులు, సరైన ఆహారంతో దీనిని నియంత్రించవచ్చు. జామ టీ తాగడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఇందుకోసం 8-10 జామ ఆకులను తీసుకుని కప్పు నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని సగానికి తగ్గించే వరకు మరిగించి వడగట్టి వాడండి. జామ ఆకులోనూ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

నిపుణుల సూచనలు
అదే విధంగా జామ టీ తాగడం వల్ల రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గించవచ్చు. జామ ఆకులు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు శరీరంలోని విష వ్యర్థాలను తొలగించి గుండెను రక్షిస్తాయి. పొటాషియం, కరిగిపోయే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు జామ ఆకుల్లో ఉన్నాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుని, కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, జామ ఆకుల రసం క్యాన్సర్ మందుల తో సమానంగా ఫలితం చూపిస్తుందని తేలింది. అయితే, ఇప్పటికే ఈ సమస్యలతో చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సలహా మేరకే వీటిని వినియోగించటం ఉత్తమం.













Click it and Unblock the Notifications
