హైదరాబాద్ లోనే బెస్ట్ సింగిల్ స్క్రీన్ థియేటర్ ఇదే.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!
తెలుగు రాష్ట్రాల్లో సినిమా అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే చాలు ఎగబడి చూసేందుకు రెడీ అవుతుంటారు. థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. కొత్త సినిమా రిలీజ్ అయినా.. రీ రిలీజ్ అయినా ఖర్చుకు వెనకాడకుండా వెళ్లి థియేటర్లలో ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హైదరాబాద్ లో చాలా మల్టీప్లెక్స్ లు ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు కొత్తగా ఐమాక్స్ స్క్రీన్ లు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. కానీ సగటు సినీ ప్రేక్షకుడ్ని మాత్రం అలరించేది సింగిల్ స్క్రీన్ మాత్రమే.. హైదరాబాద్ లో గల్లీకో మల్టీ ప్లెక్స్ వచ్చినా ఇప్పటికీ సింగిల్ స్క్రీన్ థియేటర్ లోనే తమ అభిమాన హీరో సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుంటారు.
తక్కువ టికెట్ ధరతో ఎక్కువ ఫన్ ను ఎంజాయ్ చేయాలంటే సింగిల్ స్క్రీన్ థియేటర్ బెటర్ అని ప్రేక్షకులు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని మియాపూర్ లో ఉన్న ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ సాయి రంగ 70 ఎంఎం కు అరుదైన గుర్తింపు లభించింది. తాజాగా ఈ థియేటర్ కు ప్రతిష్టాత్మక వాల్ట్ డిస్నీ గుర్తింపు లభించింది.
ఈ మేరకు తెలంగాణలో ఇన్ఫినిటీ విజన్ సర్టిఫికెట్ ను పొందిన తొలి సింగిల్ స్క్రీన్ థియేటర్ గా సాయి రంగ 70 ఎంఎం నిలిచింది. ఇక ఈ ఇన్ఫినిటీ విజన్ సర్టిఫికెట్ ను వాల్ట్ డిస్నీ అందిస్తోంది. ఈ సర్టిఫికెట్ పొందాలంటే సంబంధిత థియేటర్ స్క్రీన్ వెడల్పు 45 అడుగులు ఉండాలి. అలాగే థియేటర్ కు డాల్బి అట్మాస్ 7.1 సరౌండ్ సౌండ్ సిస్టమ్ కలిగి ఉండాలి. స్క్రీన్ బ్రైట్ కూడా స్టాండార్డ్స్ ను బట్టి ఉండాలి.

అలా సాయి రంగ 70 ఎంఎం థియేటర్ ఈ స్టాండార్డ్స్ ను కలిగి ఉంది. దాంతో ఈ థియేటర్ కు ఇన్ఫినిటీ విజన్ సర్టిఫికెట్ లభించింది. హైదరాబాద్ లో కేవలం ప్రసాద్ మల్టీప్లెక్స్, అపర్ణ మల్టీప్లెక్స్ కు మాత్రమే ఈ సర్టిఫికెట్ ఉంది. అయితే హైదరాబాద్ లోనే కాదు తెలంగాణలోనే ఈ సర్టిఫికెట్ ను అందుకున్న తొలి సింగిల్ స్క్రీన్ థియేటర్ గా సాయి రంగ నిలిచింది. ఇక 2026 నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా దాదాపు 300 స్క్రీన్ లు ఈ సర్టిఫికెట్ ను పొంది ఉన్నాయి.












Click it and Unblock the Notifications
