కోర్టు ఎదుటే నిందితుడిపై కత్తులతో దాడి.. చేయి నరికి.. వీడియో వైరల్
మహారాష్ట్ర పుణెలోని కోర్టు ఎదుటే దారుణమైన హత్యాయత్నం జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్న వ్యక్తిని కత్తులతో నరికి ఆ తర్వాత తుపాకీతో కాల్చారు. కోర్టులో హాజరయ్యేందుకు వస్తున్న నిందితుడిపై పట్టపగలే కోర్టు ఆవరణలోనే ఇలా దారుణంగా హత్యాయత్నానికి పాల్పడటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మందర్ మారుతి కివాలే అనే నిందితుడ్ని కత్తులతో చేతులు నరికారు.
ఆ తర్వాత తుపాకీతో కాల్చేశారు. పుణెలోని శివాజీనగర్ కోర్టు ఆవరణలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఈ దాడి అనంతరం రెండు స్కూటర్లలో దుండగులు పారిపోయారు. ఇక రక్తపు మడుగులో పడి ఉన్న ఆ వ్యక్తి లేచి నిల్చునేందుకు ప్రయత్నించి పడిపోయాడు. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. 2025 లో పుణెలోని సంతోష్ నగర్ ఖట్రాజ్ ప్రాంతంలో రెస్టారెంట్ యజమాని అయిన శుభమ్ సుభాష్ చవన్ ను కివాలే హత్య చేశాడు. తన స్నేహితులతో కలిసి కివాలేను దారుణంగా కొట్టి హతమార్చాడు. ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కివాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు అమర్ సాకోరే, గిరిష్ సుభాష్ బబారే, యోగేష్ బాబూరావ్ డోరేలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Murder Accused's Hand Chopped Off With Machete, Then Shot Outside Pune Courthttps://t.co/1iO1McUfsy @ritvick_ab reports https://t.co/DmfrRMUVTI
— NDTV (@ndtv) November 25, 2026
అయితే సంవత్సరం పాటు జైలు జీవితం గడిపిన కివాలే.. నాలుగు రోజుల క్రితం జైలు నుంచి బెయిల్ పై రిలీజ్ అయ్యాడు. తాజాగా కోర్టులో హాజరయ్యేందుకు వస్తున్న కివాలేపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరార్ అయ్యారు. ఇక ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం సునేత్రా పవార్.. పుణె పోలీస్ కమిషనర్ తో మాట్లాడి ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications
