మహేష్ బాబు ఒక్క కామెంట్.. చిన్నారి రీల్ కు 27 మిలియన్ల వ్యూస్..
సూపర్ స్టార్ మహేష్ బాబుకు కోట్ల మంది అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఆయన పాటలకు, డైలాగ్స్, డాన్స్ లకు రీల్స్ చేస్తూ ఎంతో మురిసిపోతుంటారు ఫ్యాన్స్. ఇక చిన్నారులు సైతం తమ బుజ్జిబుజ్జి మాటలతో మహేష్ బాబు డైలాగ్స్ చెప్పడం.. పాటలు పాడటం.. అలాగే డాన్స్ లు చేయడం చేస్తుంటారు. ఇక వాటిని డైరెక్ట్ గా సూపర్ స్టార్ మహేష్ కు ట్యాగ్ చేస్తుంటారు. కానీ ఆయన సోషల్ మీడియాలో రీల్స్ కు రెస్పాండ్ అవ్వడం చాలా అరుదు. అయితే తాజాగా ఓ చిన్నారి చేసిన రీల్ మహేష్ బాబుకు తెగ నచ్చింది. ఆ రీల్ చూసి ఆయన కూడా పడి పడి నవ్వుకున్నారు. వెంటనే ఆగలేక ఆ చిన్నారి టాలెంట్ ను గుర్తించి కామెంట్ పెట్టారు.

ఇక మహేష్ బాబు ఒక్క కామెంట్ తో ఆ చిన్నారి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఆ చిన్నారి రీల్స్ ప్రత్యక్షం అవుతున్నాయి. మహేష్ బాబు ఒక్క కామెంట్ తో ఆ చిన్నారి రీల్ కు ఏకంగా 27 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇక ఆ చిన్నారి రీల్ ఇన్ స్టాగ్రామ్ లో 'bysweetlycurious' అనే ఖాతాలో పోస్టు చేయగా.. చిన్నారి ముద్దుగా పాట పాడిన రీల్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలా వైరల్ అవుతూ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు వరకు వెళ్లడం విశేషం.
ఇక చిన్నారి పాటకు ఫిదా అయిన మహేష్ బాబు.. హహ... సో క్యూట్.. ఈ చిన్నారికి బోల్డంత ప్రేమ అని లవ్ సింబల్స్ తో కామెంట్ పెట్టారు. దాంతో రాత్రికి రాత్రే ఆ చిన్నారి ఫేమస్ కావడమే కాదు.. ఆ ఇన్ స్టా ఖాతాకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫాలో కొట్టడం స్టార్ట్ చేశారు. ఈ రీల్ లో చిన్నారి పోకిరి సినిమాలోని నొప్పి నొప్పి గుండెంత నొప్పి సాంగ్ కు పాట పాడారు. అలాగే గుంటూరు కారం సినిమాలోని ధమ్ మసాలా సాంగ్ ను పాడి మెప్పించింది. మరి మీరూ ఈ వీడియోను చూసేయండి..












Click it and Unblock the Notifications
