అయోధ్య- జనక్ పూర్ రైలులో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత.. ప్రయాణికులకు ప్రసాదంగా సాత్విక ఆహారం..

ఇక్ష్వాకు వంశానికి చెందిన మహారాజు దశరథుడు- కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించిన నేలనే అయోధ్య. ఈ పుణ్యభూమి నేటి ఉత్తరప్రదేశ్‌ లో ఉంది. అలాగే సీతాదేవి పుట్టి కల్యాణం జరిగిన మిథిలా నగరం (జనక్‌ పూర్) నేటి నేపాల్‌ లో ఉంది. అయితే ఈ రెండు నగరాలను కలుపుతూ కొత్త రైలు సర్వీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల భారత్ పర్యటనలో నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో కలిసి ప్రధాని మోదీ ఈ రైలును దేశ రాజధాని దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలుకు సరయు- కమల ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి ప్రారంభం అయ్యే ఈ రైలు అలా దిల్లీ మీదుగా నేపాల్ దేశంలోని జనక్ పురికి వెళుతుంది.

అయితే ఈ సరయు- కమల ఎక్స్ ప్రెస్ లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ రైలులో ఓ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. సాధారణ రైలులో మాదిరి కాకుండా ఈ రైలులో అటు టిఫిన్.. ఇటు లంచ్ కాకుండా కేవలం సాత్విక ఆహారాన్ని ISKCON స్వాములు ప్రసాదంగా పంచుతున్నారు. ఉల్లిపాయలు, వెలుల్లి లేకుండా చేసిన ప్యూర్ వెజ్ మీల్స్ ను ప్రయాణికులకు ప్రసాదంగా అందిస్తున్నారు. ఈ రైలు అటు శ్రీ రాముడి జన్మస్థలం అయిన అయోధ్య ను అలాగే సీతాదేవి పుట్టినిల్లు అయిన జనక్ పూర్ ను కలుపుతున్న నేపథ్యంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా ఇక్కడ రైలులోని ప్రయాణికులకు ఆహారాన్ని అందిస్తుంది ISKCON.

ISKCON monks distributing sattvic food as prasadam to passengers on the Saryu- Kamala Express news

ఇక సరయు- కమల ఎక్స్ ప్రెస్ లో కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆహార సంప్రదాయం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే దీనిపై ఓ ప్యాసింజర్ మాట్లాడుతూ.." ఈ రైలులో ఓ ప్రత్యేకమైన విధానం ఉంది. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇలాంటి విధానాన్ని రాజధాని, శతాబ్ది, వందేభారత్ రైళ్లలోనూ మీరు ఎప్పుడూ చూసుండరు" అని ఆ ప్యాసింజర్ పేర్కొన్నాడు. ఈ వీడియోలో చూస్తే.. ఇస్కాన్ స్వాములు కాషాయం వస్త్రాల్లో వచ్చి సాత్వికమైన ఆహారాన్ని ప్రసాదంగా అందిస్తున్నారు. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా ప్యూర్ వెజ్ మీల్స్ ను ప్రసాదంగా ఇస్తున్నారు. ఇది ఏదో ఒక్క రోజు కాదు.. రోజూ ఈ సేవ చేస్తున్నారు ఇస్కాన్ స్వాములు.

ఇక వాళ్లు ఇచ్చే ఆహారంలో అన్నం, పప్పు, సబ్జా, స్వీట్స్ ఉన్నాయి. మరోవైపు సరయు- కమల ఎక్స్ ప్రెస్ రైలు మొత్తం 19 గంటలపాటు 604 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రైలుకు మొత్తం 17 కోచ్ లు ఉన్నాయి. వీటిలో ఎనిమిది ఏసీ కోచ్ లు కాగా.. మిగిలిన ఏడు స్లీపర్ కాస్ కోచ్ లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+