పెళ్లి వేడుకలో కత్తులతో యువకుల హల్‌చల్.. నలుగురు అరెస్ట్

హైదరాబాద్‌ లోని రేతిబౌలిలో జరిగిన ఓ పెళ్లి భరాత్‌ ఊరేగింపు కార్యక్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది యువకులు కత్తులతో హల్ చల్ చేశారు. అందరూ చూస్తుండగానే పెద్ద పెద్ద కత్తులు తీసి వాటితో విన్యాసాలు చేస్తూ డాన్స్ చేశారు. ఆ కత్తులను అడ్డదిడ్డంగా తిప్పుతూ అక్కడున్న వారిని భయబ్రాంతులకు గురి చేసే విధంగా ప్రవర్తించారు. అయితే యువకులు కత్తులతో చేసిన డాన్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇక ఈ వైరల్ వీడియోపై గుడిమల్కాపూర్ పోలీసులు విచారణ చేపట్టారు.

వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీడియో వైరల్ కావడంతో వీడియో ఆధారంగా నృత్యం చేసిన నలుగురిని పోలీసులు గుర్తించారు. వాళ్లు కే శ్రావణ్ కుమార్ (31), సంజయ్ కుమార్ (29), సందీప్ కుమార్ (28), దిలీప్ కుమార్ (26) లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అలాగే వారి నుంచి 25.5, 32 అంగుళాల రెండు స్టీల్ కత్తులు, రెండు ప్లాస్టిక్ కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad Youths cause a stir with knives at a wedding celebration in Rethibowli hyd four arrested

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 22న బాబు జగ్జీవన్‌ రావు భవన్ కమ్యూనిటీ హాల్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు వివరించారు. ఈ మేరకు నిందితులపై గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్‌ లో ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ 25 (1B) కింద కేసు నమోదు చేసి, నలుగురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్‌ కు తరలించినట్లు వివరించారు. ఇక ఏసీపీ తిరుపతి, ఇన్‌ స్పెక్టర్ రామయ్య పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ ను చేపట్టినట్లు పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు వివాహాలు, ఇతర వేడుకల్లో కత్తులు, మారణాయుధాల ప్రదర్శనపై పోలీసులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఆయుధాలతో హల్‌ చల్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు సంచలన వార్నింగ్ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+