ఏపీలో రేపే రెండో విడత మున్సిపల్, తొలి విడత పంచాయతీ పోలింగ్..! భారీ ఏర్పాట్లు..!

ఏపీలో రెండో విడత మున్సిపల్ ఎన్నికలతో పాటు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థల్లో రేపు పోలింగ్ జరగబోతోంది. దీంతో పాటు 26 జిల్లాల్లో తొలి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల (ap local body polls) సందర్భంగా చోటు చేసుకున్న అవాంఛనీయ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.

విభజనపై అట్టుడుకుతున్న పాకిస్తాన్..! ప్రత్యేక సింధు దేశం డిమాండ్స్..!
విభజనపై అట్టుడుకుతున్న పాకిస్తాన్..! ప్రత్యేక సింధు దేశం డిమాండ్స్..!

రేపు ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన నాలుగు కార్పోరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు రేపు పోలింగ్ జరగనుంది. కార్పోరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి ఉన్నాయి. అలాగే 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కూడా ఉన్నాయి. 19 మున్సిపల్ చైర్ పర్సన్ పదవుల కోసం 134 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే 707 కౌన్సిలర్ స్థానాల కోసం 2,057 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. 19 మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 13.53 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. ఈ నెల 30న 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.

AP Local Body Polls Second Phase Municipal First Phase Gram Panchayat Elections tomorrow
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

రేపు మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ కు జరిగే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు వీరి కుటుంబ సభ్యులు ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఉండవల్లిలోని గాదె సీతారామమ్మ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో వీరు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో రేపు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. తొలి విడతలో 709 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడంతో..రేపు 26 జిల్లాల్లోని మిగిలిన 3,240 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అలాగే
మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 'చెరగని సిరా' వినియోగంపై ఎస్ఈసీ కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ఎడమ చేతి చిటికెన వేలుపై చెరగని సిరా గుర్తు వేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇటీవల ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేశారు. కొన్ని కేంద్రాల్లో రీ-పోలింగ్ వల్ల ఎడమ చేతి మధ్య వేలుపైనా సిరా గుర్తు వేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సిబ్బందికి ఎస్ఈసీ స్పష్టత ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+