మృత్యుకీలలు.. బోల్తాపడిన ఇంధన ట్యాంకర్, 31 మంది దుర్మరణం!

ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలోని ప్రధాన రహదారిపై బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. ఇంధన ట్యాంకర్ బోల్తాపడి సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 31 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం ఎలా జరిగిందంటే?
గ్రేటర్ కైరో పరిధిలోని గిజా ప్రావిన్స్‌లోని అధిక జనాభా కలిగిన వరాక్ ప్రాంతంలో రింగ్ రోడ్ హైవేపై ఈ ఘటన జరిగింది. ట్యాంకర్ బోల్తాపడిన వెంటనే భారీగా మంటలు చెలరేగి సమీపంలోని వాహనాలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రెండు డజన్లకు పైగా కార్లు, ద్విచక్రవాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో చిక్కుకున్న వారిని సహాయక సిబ్బంది బయటకు తీయగా.. అగ్నిమాపక సిబ్బంధి మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Fuel Tanker Overturned Near Cairo Causing Massive Fire 31 Dead and 21 Injured in Giza Egypt Full Details

గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఈజిప్ట్ ఆరోగ్య శాఖ మంత్రి ఖలీద్ అబ్దుల్ గఫ్పార్ వెల్లడించారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

సంతాపం తెలిపిన ఈజిప్ట్ అధ్యక్షుడు
ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్-సిసి సంతాపం తెలిపారు. ఈజిప్టులు ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అతివేగం, రహదారుల దుస్థితి, ట్రాఫిక్ నిబంధనల అమలులో లోపాలు వంటి కారణాలతో అక్కడ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కూడా బెని సుఎఫ్ సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+