డీలిమిటేషన్ బిల్లుకు జగన్ మద్దతు వెనుక..!!
డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. బీజేపీ వ్యూహాలతో ఈ బిల్లు ఆమోదం లాంఛ నంగానే కనిపిస్తోంది. డీఎంకే, ఎన్సీపీ మద్దతుతో బిల్లు పాస్ కానుంది. ఈ బిల్లు ఆమోదంతో ఇక మహిళా రిజర్వేషన్లతో పాటుగా నియోజకవర్గాల సంఖ్య 50 శాతం మేర పెరగనున్నాయి. అయితే వైసీపీ ఈ బిల్లుకు షరతులతో మద్దతు ప్రకటించింది. కొంత కాలంగా కీలక అంశాల పైన భిన్నం గా స్పందిస్తున్న జగన్ ఈ బిల్లుకు మద్దతు వెనుక భారీ వ్యూహం దాగి ఉందనే విశ్లేషణలు మొదలు అయ్యాయి. ఇదే అంశం ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.
డీలిమిటేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ప్రకటించింది. ఏప్రిల్ లో ఇదే తరహా బిల్లు సమయంలో నూ వైసీపీ మద్దతుగా నిలిచింది. అయితే, ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ఆందోళనల వేళ జగన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ తరువాత ఎన్నికల సంఘం నిర్వహణ.. ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన జగన్ చేసిన వ్యాఖ్యలు కొత్త రాజకీయ చర్చకు కారణమయ్యాయి. 2019 లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రంలోని ముఖ్యులతో జగన్ సన్నిహితంగానే ఉంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు బిల్లులకు ఆమోదం తెలిపారు. కాగా.. సీఈసీ ఎంపిక విషయంలో కేంద్రం తెచ్చిన సవరణల బిల్లుకు మద్దతు ఇవ్వటం పైన జగన్ ఈ మధ్య కాలంలో కీలక వ్యాఖ్యలు చేసారు.

కాగా, ఇప్పుడు జగన్ తిరిగి డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తూనే కీలక అంశం ప్రస్తావన చేసారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదనే విధంగా పూర్తి స్పష్టతతో బిల్లు ఉండాలని సూచన చేసారు. ఇప్పుడు కేంద్రం అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం సీట్ల పెంపు నిర్ణయంతో ఈ వివాదానికి ఎండ్ కార్డు పడింది. అటు డీఎంకే, ఇటు ఎన్సీపీ సైతం మద్దతు ప్రకటించాయి. కాగా.. జగన్ తన భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగానే ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వైసీపీకి లోక్‌సభలో నలుగురు, రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరు బిల్లు సమయం లో కేంద్రానికి మద్దతుగా నిలవనున్నారు. రాష్ట్రంలో కూటమితో రాజకీయంగా పోరాటం చేస్తున్న జగన్.. మరోసారి కేంద్రానికి మద్దతుగా నిలవటం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణంగా నిలుస్తోంది.













Click it and Unblock the Notifications
