తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగిన కార్తీక దీపం.. నాలుగు రోజుల వివాదానికి తెర!

తమిళనాడులోని మదురై సమీపంలోని తిరప్పరంకుండ్రం కొండపై ఉన్న దీప స్తంభం వద్ద శనివారం(నవంబర్ 28) కార్తీక దీపం వెలిగించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ 4 రోజుల క్రితం ఇక్కడ దీపం వెలిగించని నేపథ్యంలో భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమంలో జరిగింది. కొండ దిగువన ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకోగా.. కొండపై జరిగే వేడుకకు కేవలం 50 మంది భక్తులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీపం వెలిగించే సమయానికి సుప్రీంకోర్టు 15 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేయడం, ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేయడం, కొండ భద్రత బాధ్యతలను సీఆర్పీఎఫ్‌కు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

రేపు తిరప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రేపు తిరప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

దీపం వెలిగించిన తీరు
అరుళ్మిగు సుబ్రమణ్య స్వామి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.వైద్యనాథన్, జస్టిస్ వి.పార్థిబన్ శనివారం చెన్నై నుంచి మదురై చేరుకున్నారు. సంప్రదాయ వాయిద్యాల మధ్య మట్టి ప్రమిదలు, వత్తి, నెయ్యిని కొండ దిగువన ఉన్న ఆలయ యంత్రాంగానికి అందజేశారు. ఆలయంలో పూజల అనంతరం కొప్పరై అనే రాగి పాత్రను అర్చకులకు అప్పగించారు. రాతి స్తంభంపై ఈ పాత్రను ఉంచేందుకు సిబ్బంది తాత్కాలిక వేదిక, స్కాఫోల్డింగ్‌ను ఏర్పాటు చేశారు. సుమారు 30 గ్రాముల నెయ్యి, 50 మీటర్ల కాటన్ వత్తి, 5 కిలోల కర్పూరాన్ని సిద్ధం చేశారు.

Karthigai Deepam Lit on Thirupparankundram Hill Amid CRPF Security and Supreme Court Contempt Notices

అధికారులు, అర్చకులతో చర్చించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు దీపం వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు జస్టిస్ వైద్యనాథన్ ప్రకటించారు. ఈ వేడుకలో ఇద్దరు న్యాయమూర్తులతో పాటు మదురై జిల్లా కలెక్టర్ నిశాంత్ కృష్ణ, పోలీసు అధికారులు, పురావస్తు శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

తమిళనాడులో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ.. సీఎం విజయ్ మెడకు ఉచ్చులా 'కార్తీక దీపం’
తమిళనాడులో గేమ్ స్టార్ట్ చేసిన బీజేపీ.. సీఎం విజయ్ మెడకు ఉచ్చులా 'కార్తీక దీపం’

కొండపై సీఆర్పీఎఫ్ భద్రత
శనివారం ఉదయం నుంచే సీఆర్పీఎఫ్ బృందం, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కొండపై భద్రతా బాధ్యతలు చేపట్టారు. కొండ దిగువన, రాతి స్తంభం వైపు వెళ్లే మార్గంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేడుకకు ముందు భక్తులు, కార్యకర్తలు చేరుకోవడంతో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. వైద్య బృందాలు, అంబులెన్సులను కూడా సిద్ధంగా ఉంచారు. భద్రతా సిబ్బంది, వారి వాహనాలపై స్థానికులు, భక్తులు పూలవర్షం కురిపించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హజ్రత్ సుల్తాన్ సికందర్ బాదుషా ఔలియా దర్గా చుట్టూ 50 మీటర్ల బఫర్ జోన్ ను సీఆర్పీఎఫ్ అమలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్గాలోకి భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా తెరిచే ఉంచారు. దీపం వెలిగించే ఏర్పాట్లు జరుగుతుండగానే దర్గా వద్ద భక్తులు ప్రార్థనలు చేశారు.

సుప్రీంకోర్టు జోక్యం ఎందుకు?
నవంబర్ 24న ఓ ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా దీపస్తంభం వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ బృందానికి సుప్రీంకోర్టు నవంబర్ 20న అనుమతి ఇచ్చింది. అయితే ఆ రోజు కొండ దిగువ భాగంలోని సాధారణ ప్రదేశంలో మాత్రమే దీపం వెలిగించారు. రాతి స్తంభం వద్ద దీపం వెలిగించకపోవడం కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లు కనిపిస్తోందని శుక్రవారం జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా మరో 13 మందికి కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇచ్చేందుకు డిసెంబర్ 15న హాజరుకావాలని ఆదేశించింది. శనివారం దీపం వెలిగించాలని ఆదేశించడంతో పాటు కొండ భద్రతను సీఆర్పీఎఫ్‌కు అప్పగించింది.

దీపం వివాదం ఎలా మొదలైందంటే?
కొండపై ఏ ప్రదేశంలో పండుగ దీపం వెలిగించాలనేదే ఈ వివాదానికి ప్రధాన కారణం. కొండ దిగువ భాగంలోని ఉచ్చిపిళ్లైయార్ ఆలయం సమీపంలోని దీప మండపంలో 150 ఏళ్లకు పైగా ఈ ఆచారం కొనసాగుతోందని తమిళనాడు ప్రభుత్వం చెబుతోంది. అయితే కొండపై దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న దీపతూణ్ వద్ద దీపం వెలిగించాలని పిటిషనర్లు కోరుతుండగా.. దర్గా ప్రతినిధులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. 1923లో వచ్చిన సివిల్ కోర్టు డిక్రీ ప్రకారం కొండలోని చాలా ప్రాంతాలపై సుబ్రమణ్యస్వామి ఆలయ హక్కులను, దర్గా ప్రాంగణం, దాని మార్గం వంటి ప్రాంతాలపై ముస్లింల యాజమాన్యాన్ని గుర్తించారు. 1931లో ప్రైవీ కౌన్సిల్ ఆ డిక్రీని పునరుద్ధరించింది. 1990లలో ఈ అంశం మద్రాసు హైకోర్టు వరకు వెళ్లింది. సంప్రదాయ ప్రదేశంలోనే దీపం వెలిగించడాన్ని సమర్థించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆనాటి న్యాయప్రక్రియలను ప్రస్తావించింది. తాజాగా ఈ ఏడాది వేడుక కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు శనివారం దూపతూణ్ వద్ద దీపం వెలిగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+