చిక్కుడుకాయ టమాటా కూర ఇలా చేసి చూడండి,.. వదిలితే ఒట్టు.. నమ్మండి!

సీజన్ లో కాసే గింజల చిక్కుడుకాయ కూర అంటే దాని రుచి తెలిసిన వారికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఈ సీజన్ లో కాసే గింజల చిక్కుడుకాయలతో చిక్కుడుకాయ టమాటా కూర చేస్తే సూపర్ గా ఉంటుంది. దీని రుచి మాత్రం మాటల్లో చెప్పలేనంత అద్భుతంగా ఉంటుంది. ఎటువంటి హంగూ ఆర్భాటాలు, ఎక్కువ మసాలాలు లేకుండా కేవలం ఇంట్లో ఉండే సాధారణ పదార్థాలతోనే ఈ కూరను తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ కూర కలుపుకుని తింటే ఆ రుచే వేరుగా ఉంటుంది.

కావాల్సిన పదార్థాలు:

చిక్కుడుకాయలు - అర కేజీ (పెద్ద గింజలు ఉన్నవైతే రుచి బాగుంటుంది)
టమాటాలు - పావు కేజీ (ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి)
ఉల్లిపాయలు - 2 ( కట్ చేసుకున్నవి)
పచ్చిమిర్చి - 4 ( కట్ చేసుకున్నవి)
అల్లం వెల్లుల్లి ముద్ద - ఒక స్పూన్ (వీలైతే తాజాగా దంచుకున్నది)
పసుపు - పావు స్పూన్
కారం - 2 స్పూన్స్ (ఈ కూరకు కాస్త కారం ఎక్కువుంటేనే బాగుంటుంది)
ఉప్పు - ఒకటిన్నర స్పూన్
కొత్తిమీర - గుప్పెడు
పోపు గింజలు- ఒక స్పూన్
వేరుశెనగ నూనె - మూడు స్పూన్స్

Traditional Chikkudukaya Tomato Curry Recipe Old-Style cooking super Taste Made Easy with these tips

ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి, గింజలను వేరు చేసి లోపల పురుగులు ఏమైనా ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ తర్వాత చిక్కుడుకాయలు, టమాటాలు, ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. ఆపై స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత అందులో పోపుగింజలు వేసి వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగాక చిక్కుడుకాయ ముక్కలు వేసి పసుపు ,ఉప్పు వేసి కాసేపు మగ్గనివాలి.

మటన్ లివర్ తింటే రక్తం, బలం.. వారానికి ఒక్కసారి చాలు, వీరు మాత్రం తినొద్దు!
మటన్ లివర్ తింటే రక్తం, బలం.. వారానికి ఒక్కసారి చాలు, వీరు మాత్రం తినొద్దు!

ఆపైన అందులో టమాటా ముక్కలు కూడా వేసి అందులో మసాలా కారం వేసి బాగా ఉడికించాలి. చిక్కుడుకాయ గింజలు కూడా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా ఉడికించాలి. ఇది పట్టి కూరకు అసలైన రుచి వస్తుంది. టమాటాలలో బాగా రసం ఉంటే ఓకే లేదంటేకొద్దిగా నీరు పోసి ఉడికించుకోవాలి. ఈ కూరకు గరం మసాలాలు, కరివేపాకు వంటివి అవసరం లేదు; నీరు ఇగిరి కొద్దిగా డ్రైగా దించితే అన్నం, చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+