Viral Video: పాకిస్థాన్ లో రోటీ తనిఖీ వైరల్.. వీడియో చూస్తే పొట్ట చెక్కలే..
ప్రస్తుతం పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్థాన్ లో పిండి, వంట గ్యాస్ ధరలకు రెక్కలు వచ్చాయి. దాంతో రొట్టెల తయారీ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే డిసెంబర్ 4 నుంచి లాహోర్ లో రొట్టెల విక్రయాన్ని నిలిపివేస్తామని వ్యాపారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇక పాకిస్థాన్ లోని ఓ అధికారిణి చేసిన చిన్న పొరపాటు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ మెటీరియల్ గా మారింది. స్థానిక దుకాణాల్లో రొట్టె ధర, బరువు తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆమె రొట్టె బరువు 90 గ్రాములు ఉండగా.. పొరపాటున 90 రూపాయలు అనేశారు. దాంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

ఏం జరిగింది..?
పాకిస్థాన్ లాహోర్ లోని నిస్తార్ తహసీల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పంజాబ్ ఎన్ ఫోర్స్ మెంట్ అండ్ రెగ్యూలేటరీ అథారిటీలో పనిచేసే ఓ అధికారిణి స్థానికంగా ఓ హోటల్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రోటీని ఎంత ధరకు విక్రయిస్తున్నారని హోటల్ యజమానిని అడిగి తెలుసుకున్నారు. అతను ఒక్కో రొట్టెను రూ. 20 కు విక్రయిస్తున్నట్లు తెలిపాడు. అయితే ఒక్కో రొట్టె ధరను ప్రభుత్వం రూ. 14 గా నిర్ణయించిందని పేర్కొన్నారు. రొట్టె కనీసం 100 గ్రాముల బరువు ఉంటే మాత్రం రూ. 17 వరకు విక్రయించుకోవచ్చని తెలిపారు.
Roti Price and Weight Inspections in Nishtar Tehsil, LahorePERA Force conducts inspections at tandoors in Nishtar Tehsil, Lahore, checking roti prices and weight to ensure compliance with officially prescribed rates and weight standards, prevent overcharging and underweight sales, and protect consumer rights.
— PERA (@PERAPunjab) November 24, 2026
ఈ క్రమంలోనే ఆ అధికారిణి ఓ రొట్టెను తీసుకుని తూకం మెషిన్ పై పెట్టారు. అప్పుడు అది 90 అని చూపించింది. దాంతో ఆమె అది ధర అనుకుని 90 రూపాయలు అనేశారు. ఆ తర్వాత 90 గ్రాములు అని అన్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications
