తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 'రైతు భరోసా' నిధుల విడుదలకు డేట్ ఫిక్స్..
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలకు తేదీని ఖరారు చేసింది రేవంత్ సర్కార్. ఈనెల 22న రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,590 కోట్ల నిధులు బదిలీ చేయనుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో తొలి విడత నిధులు సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు.
తెలంగాణలోని అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ నెల 22 తేదీ నుంచి రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

నిధుల విడుదల నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న దాదాపు 70 లక్షల రైతుల ఖాతాల్లో రూ. 3,590 కోట్ల నగదు జమ కానుంది. అలాగే 20రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నట్లు సమాచారం. మొత్తం మూడు విడతల్లో కలిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి. ఇక గత కొంతకాలంగా ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం అని చెప్పొచ్చు.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications