Omar Abdullah: కశ్మీర్ లో పీఓకే విలీనం ? కేంద్రం ఆ పని చేయకపోతే..! ఒమర్ వ్యాఖ్యలు..!

పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లో ఈ మధ్య వరుసగా తిరుగుబాట్లు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న ఇక్కడి ప్రజలు బలూచిస్తూనే తరహాలో స్వాతంత్రం కావాలంటున్నారు. భారత్ అనుమతిస్తే విలీనం అయిపోయేందుకు కూడా సిధ్దమంటున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఇవాళ సంచలన విషయం బయటపెట్టారు.

NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!
NALSAR-CJI Row: హైదరాబాద్ నల్సార్ విద్యార్థులపై సీజేఐ కీలక ఆదేశాలు..! నిరసనలపై..!

కేంద్రం 2019లో జమ్ము కాశ్మీర్ కు రాష్ట్ర హోదా రద్దు చేయడంతో పాటు మూడు ముక్కలు చేసి , రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం గతంలో కల్పించిన ప్రత్యేక హోదాను సైతం రద్దు చేసింది. దీంతో కాశ్మీర్ లో ఉగ్రవాదం ఉండదని చెప్పుకుంది. కానీ ఇప్పటికీ అక్కడ పహల్గాం వంటి ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయలో పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం 2019లో ఆ నిర్ణయాలు తీసుకోకపోయి ఉంటే ఇప్పటికే వారు కాశ్మీర్ లో విలీనం అయిపోయేవారని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ పేర్కొన్నారు.

Omar Abdullah Claims PoK People Would Seek Reintegration With J amp amp K Without 2019 Changes
నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!
నల్సార్ కు బార్ కౌన్సిల్ సారీ చెప్పాల్సిందే..! సీజేఐకి మరో లా యూనివర్శిటీ షాక్..!

కేంద్రం ఆ నిర్ణయాలు తీసుకోకపోతే.. ఇప్పటికి వారంతా తిరిగి జమ్మూ కాశ్మీర్ లో విలీనం కోసం ఉద్యమాలు చేసేవారని ఒమర్ తెలిపారు. ప్రస్తుతం పీఓకేలో నెలకొన్న పరిస్థితులు, 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన గిరిజన దండయాత్రలను ఎదుర్కొని, భారత్‌లో విలీనానికి జమ్మూ కశ్మీర్ ప్రజలు తీసుకున్న నిర్ణయం సరైనదేనని నిరూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.పీఓకేలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆందోళన చేస్తున్న ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం, అరెస్టులకు గురవడం తనను బాధించిందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తన తాత, జమ్మూ కశ్మీర్ తొలి ప్రధానమంత్రి షేక్ మహ్మద్ అబ్దుల్లాను ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు. 1947లో పాకిస్థాన్ నుంచి వచ్చిన శత్రువుల్ని ఎదుర్కొని, భారత సైన్యం కశ్మీర్‌కు చేరుకునే ముందే ప్రజలను సమీకరించి తమ భూమిని కాపాడేందుకు షేక్ అబ్దుల్లా నాయకత్వం గుర్తుచేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+