నన్ను తిట్టిన పర్వాలేదు.. ఇప్పుడైనా మేల్కొండి! ట్రోలింగ్‌పై యాంకర్ రష్మీ ఫైర్!

Rashmi Gautam: టాలీవుడ్‌ యాంకర్‌, నటి రష్మీ గౌతమ్‌ మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. జంతు సంక్షేమం, ముఖ్యంగా వీధి కుక్కల విషయంలో ఆమె తరచూ తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ చిన్నారి మృతి ఘటన నేపథ్యంలో రష్మీని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. అంతేకాదు ఆమెపై దారుణంగా ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆమె దిమ్మతిరిగిపోయేలా సమాధానమిచ్చింది. ఇంతకీ ఏమన్నారంటే?

చిన్నారి మృతి ఘటనపై ప్రశ్నలు
ఇటీవల కుక్క కాటు కారణంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటనపై సోషల్‌ మీడియాలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో రష్మీని ట్యాగ్‌ చేస్తూ ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. వీధి కుక్కలకు మద్దతుగా మాట్లాడే ఆమె.. చిన్నారి మృతి విషయంలో ఏం చెబుతారని అడిగారు. ఆమెపై ట్రోలింగ్ కూడా చేశారు. వ్యంగంగా మీమ్స్ కూడా చేశారు. దీంతో ఆ ట్రోలింగ్‌కు రష్మీ నేరుగా సమాధానం ఇవ్వడంతో పాటు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వ్యక్తిగతంగా తనను విమర్శించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆమె పేర్కొన్నారు. అసలు అధికారులను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Rashmi Gautam Viral Post Abuse Me But Question Authorities Over Animal Welfare

'నన్ను అవమానించండి.. నాకు పట్టింపు లేదు'
తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో రష్మీ ఘాటుగా స్పందించారు. తనను అవమానించినా, కించపరిచినా, దూషించినా పట్టించుకోనని స్పష్టం చేశారు. అయితే అదే సమయంలో ప్రజలు వ్యవస్థను ప్రశ్నించాలని కోరారు. జంతు సంక్షేమం కోసం కేటాయిస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు. జంతు సంరక్షణ కేంద్రాలు ఎందుకు సరైన పరిస్థితుల్లో లేవని నిలదీశారు. ప్రభుత్వ పశువైద్య ఆసుపత్రుల్లో తగిన సదుపాయాలు ఎందుకు లేవని కూడా ప్రశ్నించారు.

వీధి కుక్కల విషయంలో రష్మీ ప్రశ్నలు
వీధి కుక్కలు, పిల్లులకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు, టీకాలు సక్రమంగా ఎందుకు జరగడం లేదని రష్మీ ప్రశ్నించారు. జంతువుల సంఖ్యను నియంత్రించడంతో పాటు వ్యాధుల నివారణకు టీకాలు కూడా కీలకమని ఆమె తన పోస్టులో ప్రస్తావించారు. అదే సమయంలో ఆవులు, గేదెల యజమానులకు సరైన అవగాహన, మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. జంతువుల సంరక్షణకు సంబంధించిన బాధ్యతలు కేవలం కొంతమందిపైనే ఉండకూడదనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.

రష్మీ తన పోస్ట్‌లో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. వన్యప్రాణులు తరచూ మానవ నివాస ప్రాంతాల్లోకి ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన పర్యావరణ సమస్యలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. భవిష్యత్ తరాలకు పచ్చదనం మిగులుతుందా? అని ఆమె ప్రశ్నించారు. జంతు సంక్షేమాన్ని పర్యావరణ పరిరక్షణతో అనుసంధానిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించారు. తనను సోషల్‌ మీడియాలో విమర్శించే వారిని ఉద్దేశించి కూడా రష్మీ వ్యాఖ్యలు చేశారు.

తన సోషల్‌ మీడియా పేజీలోకి వచ్చి వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. కేవలం ఆన్‌లైన్‌లో వాదించుకోవడం కంటే సమస్యలపై బాధ్యత వహించాల్సిన అధికారులను ప్రశ్నించాలని సూచించారు. ప్రజలు తమ సమయాన్ని, శక్తిని సరైన దిశలో ఉపయోగించాలని కోరారు. ఈ క్రమంలో రష్మీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

అయితే వీధి కుక్కల సమస్యపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఒకవైపు జంతువులపై హింసను అరికట్టాలని కొందరు కోరుతున్నారు. మరోవైపు ప్రజల భద్రత, ముఖ్యంగా చిన్నారుల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో టీకాలు, సంతాన నియంత్రణ, జంతు సంరక్షణ కేంద్రాలు, ప్రజా అవగాహన వంటి అంశాలపై సమర్థవంతమైన చర్యలు అవసరమనే చర్చ సాగుతోంది. రష్మీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+