డీలిమిటేషన్ పై పై కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం- ప్రతిపక్షాలు కోరినట్లుగానే, ఇక..!!
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెరిగిన స్థానాల సంఖ్య, రాష్ట్రాల మధ్య ప్రస్తుత సీట్ల నిష్పత్తిని 2051 వరకు కొనసాగించే ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. దీంతో పాటుగా మహిళా రిజర్వేషన్ అమలుకు వీలుగా రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇక, పార్లమెంట్ వేదికగా ఈ బిల్లులకు ఆమోదం దిశగా తుది కసరత్తు కొనసాగుతోంది.
కేంద్రం తమ వ్యూహాలను పక్కాగా అమలు చేస్తోంది. ఇప్పటికే ఈ నెల 30వ తేదీ పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ అమలు బిల్లును ప్రతిపాదించేందుకు సిద్దమైంది. గతంలో పార్లమెంట్ లో ఈ బిల్లు వీగిపోవటంతో ఈ సారి పార్టీల మద్దతు.. ఎక్కడా అభ్యంతరం లేకుండా బిల్లు ఆమోదం లభించేలా మార్పులు చేసింది. ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయిన కేంద్ర కేబినెట్ ఈ కీలక బిల్లుల ను ఆమోదించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోనుంది. అదే విధంగా రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తికి భంగం కలగకుండా సీట్ల పెంపుకు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం మేర పెరగనున్నాయి. అదే విధంగా కాంగ్రెస్ సహా డీఎంకే ప్రతిపాదన చేస్తున్నట్లుగా రానున్న 25 ఏళ్ల పాటు సీట్ల సంఖ్యలో ఎలాంటి మార్పులకు అవకాశం లేకుండా ఈ బిల్లు తీసుకొచ్చేందుకు రంగం సిద్దం చేసారు. ఈ నెల 30వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 2వ తేదీన రాజ్యసభ సమావేశం కానుంది.
కాగా.. ఈ బిల్లు ఆమోదానికి కావాల్సిన సంఖ్యా బలం పైనా ఎన్డీఏ నేతలు కసరత్తు పూర్తి చేసారు. ప్రతిపక్షాలు కోరిన విధంగా బిల్లులో మార్పులు చేయటంతో ఇబ్బంది లేకుండా బిల్లు ఆమోదం పొందుతుందనే అంచానతో ఉన్నారు. కాగా, ఇప్పుడు కాంగ్రెస్ చేసిన డిమాండ్లు బిల్లులో చేర్చటంతో ఇప్పుడు ఇండి కూటమి నిర్ణయం ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, బీజేపీ నేతల సమాచారం మేరకు ఈ బిల్లు ఆమోదం పొందటం లాంఛనంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
