ఏపీకి మళ్లీ తుపాను ముప్పు - ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా హెచ్చరిక..!!
ఏపీ వైపు మరో వైపు తుఫాను దూసుకొస్తోంది. వరుసగా రెండు తుఫాన్లతో ఏపీకి నష్టం జరిగింది. కాగా, ఇప్పుడు వరుసగా మరో రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నవంబర్ 30 నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసింది. అనంతరం ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలు ఉన్నా యని తెలిపింది. దీంతో, డిసెంబర్ తొలి వారంలో తుఫాను అవకాశం ఉందని అంచనాగా వెల్ల డించారు. దీంతో, యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడనున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ నెల 30వ తేదీ నాటికి అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ అల్పపీడనం మరింత బలపడి డిసెంబర్ 2 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సూచనలు ఉన్నాయని విశ్లేషించింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది. అల్పపీడనం వాయుగుండంగా బలపడిన తర్వాత పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని ఏపీఎస్‌డీఎంఏ తెలిపింది. ఈ క్రమంలో తమిళనాడు లేదంటే శ్రీలంక తీరాల వైపు పయణించవచ్చని అంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ తాజా అంచనాలు
కాగా, దీని గమనంపై వాతావరణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అల్పపీడనం ఏర్పడకముందే దాని గమనం, తీవ్రతపై స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే చాన్స్ ఉంది. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురవవచ్చని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురుగా తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొన్నారు. తెలంగాణలోనూ వర్షాలు దంచికొట్టనున్నాయి. హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇవాళ సాయంత్రం కూడా నగరంలోని మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications
