రామాయణ మీరే తియ్యొచ్చు కదా: తేల్చి చెప్పిన సీజేఐ బెంచ్

రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్. ఈ ఎపిక్ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటున 100 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తోంది. విడుదలైన ఈ 23 రోజుల్లో ఈ మూవీ కలెక్షన్లు 1,800 కోట్ల రూపాయలను దాటడం దీనికి నిదర్శనం. ఇప్పటివరకు ఏ ఫిల్మ్ కూడా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టలేదు. బాహుబలి, దురంధర్, పుష్ప.. రామాయణ కలెక్షన్ల ముందు దిగదుడుపే అయ్యాయి. న్యూ బెంచ్ మార్క్ ను సెట్ చేస్తోందీ మూవీ.

ఈ సినిమా ప్రదర్శనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. నవంబర్ 5న ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతున్నందున దీనిపై తక్షణమే విచారణ జరిపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసును సాధారణ ప్రక్రియలోనే చేపడతామని, తగిన సమయం చూసుకుని లిస్ట్ చేస్తామని పేర్కొంది.

Supreme Court declines to urgently list a petition challenging the Ranbir Kapoor-starrer Ramayana

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన తో కూడిన ముగ్గురు సభ్యుల సమక్షానికి వచ్చిందీ పిటీషన్. పురాణ ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో పలు కీలక విషయాలు, వాస్తవాలను వక్రీకరించారని పిటిషనర్ ఈ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాచీన గ్రంధాలు, చరిత్రను వక్రీకరించేలా సినిమా తీయడం సరికాదని పేర్కొన్నారు. అత్యవసరంగా పిటీషన్ ను విచరాణకు స్వీకరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం
ఎపిక్ రామాయణ వేవ్: ప్రధాని మోదీ కీలక నిర్ణయం

పిటీషనర్ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. సినిమా ఇప్పటికే విడుదలైందని గుర్తు చేసింది. చూడాలనుకున్న ప్రేక్షకులు ఇప్పటికే థియేటర్లకు వెళ్లి వీక్షించారని, సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం గానీ, అత్యవసరంగా విచారించడానికి గానీ తగిన కారణాలు లేవని బెంచ్ తేల్చి చెప్పింది.

బౌలింగ్ స్టైల్ మార్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. అయినా సరే
బౌలింగ్ స్టైల్ మార్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. అయినా సరే

అత్యవసర విచారణ కోసం పిటిషనర్ తరఫు న్యాయవాది పదే పదే ప్రస్తావించడంతో ఒకదశలో న్యాయమూర్తులు సహనం కోల్పోయారు. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ, సినిమా థియేటర్లలో ప్రదర్శితమవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికీ తమ సొంత అభిప్రాయాలు ఉంటాయని చెప్పారు. ఒక చిత్రాన్ని కొందరు మెచ్చుకోవచ్చని, మరికొందరు విమర్శించవచ్చని, ప్రజాస్వామ్యంలో ఈ రెండూ గౌరవప్రదమైన విషయాలేనని పేర్కొన్నారు.

డీలిమిటేషన్ వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు గోల్డెన్ ఛాన్స్: సీట్ల నిష్పత్తి
డీలిమిటేషన్ వల్ల ఈ నాలుగు రాష్ట్రాలకు గోల్డెన్ ఛాన్స్: సీట్ల నిష్పత్తి

సినిమా నిర్మాతలు తమకు ఉన్న అవగాహన మేరకు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇతిహాసంపై వేరే అభిప్రాయం గానీ, భిన్నమైన దృక్పథం గానీ ఉంటే దానికి అనుగుణంగా పిటీషనరే ఓ కొత్త సినిమా లేదా డాక్యుమెంటరీ నిర్మించుకోవచ్చని హితవు పలికారు. కోర్టు విలువైన సమయాన్ని వృథా చేయవద్దని చురకలు అంటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+