సడన్ గా డీలిమిటేషన్ పై మారిన కేంద్రం మైండ్ సెట్- రాష్ట్రాలకు సమానంగా 50 శాతం సీట్లు?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కేబినెట్ కీలక భేటీకి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు అత్యవసరంగా సమావేశం కానుంది. డీలిమిటేసన్, మహిళా రిజర్వేషన్ తో కూడిన సవరణల బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ కీలక బిల్లును లోక్ సభ, రాజ్యసభల సమక్షానికి తీసుకువచ్చి ఆమోదింపజేసుకోవాలనే పట్టుదలతో ఉంది కేంద్ర ప్రభుత్వం.

ఈ పరిణామాల మధ్య డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహం మారినట్టు తెలుస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి భారీ మార్పులు చేపట్టనున్నట్లు సమాచారం. లోక్‌సభ స్థానాల సంఖ్యను దేశవ్యాప్తంగా 50 శాతం మేర పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఈ పునర్విభజన ప్రక్రియను జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా వేరు చేయడం వంటి రెండు కీలక ప్రతిపాదనలు కేంద్ర కేబినెట్ సమక్షానికి వచ్చే అవకాశం ఉంది.

Centre is likely to consider 50 percent increase in Lok Sabha seats all states and delinking Census

చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం ఢిల్లీలో జరుగుతోంది. ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు సంబంధించిన కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఇలా సడన్ గా కేంద్రం తన వైఖరిని మార్చుకోవడానికి కారణాలు లేకపోలేదని కూడా చెబుతున్నాయి.

నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ: డీలిమిటేషన్ బిల్లుపై..!!
నేడు కేంద్ర కేబినెట్ అత్యవసర భేటీ: డీలిమిటేషన్ బిల్లుపై..!!

గతంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించని విషయం తెలిసిందే. ఏప్రిల్ 17 నాటి ఓటింగ్‌లో దీనికి మెజారిటీ లభించలేదు. ఆ సమయంలో 528 మంది సభ్యులు ఈ బిల్లుపై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 352 ఓట్లు రావాల్సి ఉండగా 298కే పరిమితం కావడంతో బిల్లు అప్పట్లో ఆమోదం పొందలేదు. 54 ఓట్ల తేడాతో బిల్లు వీగిపోయింది.

కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!

ఈ నేపథ్యంలో మహిళలకు చట్టసభల్లో 33 శాతం ప్రాతినిధ్యం కల్పించే దిశగా ఉన్న సాంకేతిక, న్యాయపరమైన అడ్డంకులను తొలగించడానికి కేంద్రం.. ఈ నూతన విధానాన్ని అన్వేషిస్తోన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్‌సభ స్థానాల సంఖ్యను సమానంగా 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. జనాభా లెక్కలను ఈ డీలిమిటేషన్ బిల్లు నుంచి వేరు చేయాలనే నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.

పడి లేచిన బంగారం ధరలు- నూతన ఊపు
పడి లేచిన బంగారం ధరలు- నూతన ఊపు

జనాభా ప్రాతిపదిక ఆధారంగా కాకుండా, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనేది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా 50 శాతం పెంచడం వల్ల ఎటువంటి అభ్యంతరాలు కూడా వ్యక్తం కాబోవని కేంద్రం అంచనా వేస్తోంది. ఈ ప్రతిపాదనలు నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సేవా తీర్థ్ లో ఏర్పాటు కాబోయే మంత్రివర్గ సమావేశం సమక్షానికి రాబోతోందని, దీనిపై అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత ఆమోదం తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనేది జనాభా లెక్కల సేకరణ ఆధారంగానే జరగాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది. దీంతో సెన్సస్ పూర్తయ్యే వరకు వేచి చూస్తే మహిళా రిజర్వేషన్ల అమలు మరింత ఆలస్యం అవుతుందనే అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ పెద్దల్లో ఉందని, అందుకే డీలిమిటేషన్ ప్రక్రియను జనాభా లెక్కలతో ముడిపెట్టకుండా స్వతంత్రంగా నిర్వహించేలా నిబంధనల్లో తగిన మార్పులు చేయాలని యోచిస్తోన్నారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+