పడి లేచిన బంగారం ధరలు- నూతన ఊపు

దేశీయ బులియన్ మార్కెట్‌లో నేడు పసిడి, వెండి ధరలు మళ్లీ శరవేగంగా పుంజుకున్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే పసిడి, వెండి ధరలలో స్పష్టమైన పెరుగుదల కనిపించింది. రిటైల్ కొనుగోలుదారుల నుంచి భారీగా డిమాండ్ లభిస్తోండటం దీనికి కారణమైంది. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల పరిణామాలు, డాలర్ బలం పెరుగుదల నేపథ్యంలో బంగారం ధరలు పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.

గురువారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 24 క్యారెట్లల్లో రూ. 1,750, 22 క్యారెట్లల్లో రూ. 1,600, 18 క్యారరెట్లల్లో రూ. 1,310 మేర పెరుగుదల కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX) లో ఈ ఉదయం ట్రేడింగ్ సమయంలో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 1.63 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,24,790 వద్ద నమోదైంది. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ 4.06 శాతం పెరిగి కిలోకు రూ. 1,52,530 స్థాయికి చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లపై కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే అంచనాలు, ద్రవ్యోల్బణ ఆందోళనల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.4 శాతం తగ్గి ఔన్సుకు 3,566.99 డాలర్ల వద్ద నిలిచింది.

Gold and silver rates rebound in India at MCX amid a strong dollar and bets on tighter US Fed policy

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,740 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,18,680 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,24,550 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,18,490 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,24,910, రూ.1,18,830 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,24,650, 22 క్యారెట్లు రూ. 1,18,580 వద్ద కొనసాగుతున్నాయి.

కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!
కేంద్రానికి మళ్లీ జగన్ అవసరం వచ్చింది.. !!

నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి

చెన్నై..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,490

ముంబై..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

బెంగళూరు..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

హైదరాబాద్..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

విజయవాడ..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

విశాఖపట్నం..

24 క్యారెట్లు- రూ. 12,655, 22 క్యారెట్లు - రూ. 11,600, 18 క్యారెట్లు - రూ. 9,491

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+