అమరావతికి ప్రధాని మోదీ - నియోజకవర్గాల పెంపు వేళ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..!!

కేంద్రం తాజా నిర్ణయాలతో ఏపీలో పార్టీలు అప్రమత్తం అయ్యాయి. మహిళా రిజర్వేషన్ తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రం ముహూర్తం ఖరారు చేసింది. ఇటు ఏపీలోనూ వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ప్రభుత్వం కొత్త నిర్ణయాల అమలుకు సిద్దమైంది. అమరావతికి ప్రధాని మోదీ రాఖ దాదాపు ఖారరైంది. ఈ సమయంలోనే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనుంది. పంచాయితీ ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల పైన రాజకీయం గా ఆసక్తి నెలకొంది.

ఏపీ కేబినెట్ ఈ రోజు భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. రూ.88,392 కోట్ల పెట్టుబడులతో పాటు ఉద్యోగాల కల్పన, హైపర్‌స్కేల్ డేటా సెంటర్, అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా.. క్వాంటమ్ సెంటర్ ప్రారంభానికి ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. ఫిబ్రవరి 3 లేదా 5 తేదీల్లో ఈ పర్యటన ఖరారు కానుంది. అదే విధంగా తాజాగా ఎస్ఐపీబీ లో ఆమోదం పొందిన రూ.88,392 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 18 ప్రాజెక్టుల ద్వారా 54,210 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు నిర్ణయం తీసుకోనుంది. అలాగే, శ్రీసత్యసాయి జిల్లాలో రూ.19 వేల కోట్లతో కియా పరిశ్రమ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీని ద్వారా మరో 12 వేల మందికి ఉద్యోగాలు కల్పించ నుంది. అనకాపల్లి జిల్లా తూటిపాలలో రూ.47,009 కోట్లతో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

పార్లమెంట్ సమావేశం, బిల్లుల పై మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం- ముహూర్తం..!!
పార్లమెంట్ సమావేశం, బిల్లుల పై మంత్రులకు ప్రధాని మోదీ దిశా నిర్దేశం- ముహూర్తం..!!
ap-cabinet-to-approve-new-investments-decide-on-assembly-sessions-today-details-here

అసెంబ్లీ సమావేశాల పైనా నిర్ణయం

అదే విధంగా రాజధాని అమరావతిలో రూ.1,921 కోట్లకు పైగా విలువైన కీలక అభివృద్ధి పనులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అమరావతి పరిధిలోని 26 గ్రామాల్లో రూ.1,215.70 కోట్లతో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణానికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అమరావతిలో రూ.80 కోట్లతో గ్రీనరీ అభివృద్ధి పనులకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. రూ.626.14 కోట్లతో అమరావతి సంగమం ప్రాజెక్టుతో పాటు, అమరావతిలో పబ్లిక్ లైబ్రరీ, ఆడిటోరియం, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ భవన నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాజధాని ప్రాంతంలో ఐదు కీలక రహదారుల అభివృద్ధికి సంబంధించిన ఏఐఐబీ నిధుల వినియోగానికి ఆమోదం తెలపనుంది. ఎల్‌పీఎస్ (LPS) జోన్-10లో మౌలిక వసతుల అభివృద్ధికి ఏఐఐబీ ఆర్థిక సహకారానికి కేబినెట్ అనుమతి ఇవ్వనుంది. క్యాపిటల్ రీజియన్ పరిధిలో బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపటంతో పాటుగా పంచాయితీ ఎన్నికలు.. తాజా రాజకీయ పరిస్థితులతో పాటుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన అధికారిక అజెండా తరువాత సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించి... మిగిలిన రెండు విడతల పంచాయితీ ఎన్నికల పైన దిశా నిర్దేశం చేయనున్నారు. కేంద్రం డీలిమిటేషన్ బిల్లు తీసుకొస్తున్న వేళ ఈ అంశం పైనా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+