రాత్రి బావర్చీ రెస్టారెంట్ లో బీఆర్ఎస్- కాంగ్రెస్ ఘర్షణ: బిర్యానీ ప్లేట్లతో.. !!

హైదరాబాద్‌లోని ప్రముఖ బావర్చి రెస్టారెంట్ వేదికగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఇచ్చిన ఉద్యోగ నియామకాల హామీలను గుర్తు చేస్తూ బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని బావర్చి హోటల్‌లో రాహుల్ గాంధీ ఫొటోకు బిర్యానీ తినిపిస్తున్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు ప్రదర్శన నిర్వహించడం, దీన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో వాతావరణం వేడెక్కింది.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. అంటే 2023 నవంబర్ 27న రాహుల్ గాంధీ బావర్చి రెస్టారెంట్‌లో బిర్యానీ తింటూ నిరుద్యోగులకు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీన్ని గుర్తు చేస్తూ క్రిషాంక్, పుత్తా విష్ణువర్ధన్ రెడ్డి, ముఠా జైసింహ ఇతర నాయకులు ఈ నిరసన చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నాడు ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని విమర్శించారు.

BRS leaders stage a biryani protest at Bavarchi restaurant near RTC Crossroads Hyderabad prevailed

బీఆర్‌ఎస్ నేతలు బిర్యానీ నిరసన చేపట్టారన్న విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బావర్చీకి చేరుకున్నారు. క్రిషాంక్, ఇతర నాయకులను అడ్డుకున్నారు. వారి చేతుల్లో నుంచి రాహుల్ గాంధీ ఫొటోను లాక్కోవడానికి ప్రయత్నించారు. వారితో వాగ్వివాదానికి దిగారు. ఫలితంగా రెస్టారెంట్ లో తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు వారిస్తోన్న వినిపించుకోకుండా రెండు పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. బిర్యానీ ప్లేట్లు, చేతికి అందిన వస్తువులను ఒకరిపై ఒకరు విసిరేసుకున్నారు.

ఎల్లుండి.. తిరుమల పార్వేట మండపంలో.. !!
ఎల్లుండి.. తిరుమల పార్వేట మండపంలో.. !!

దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కూడా కాంగ్రెస్ నాయకులతో కలిసి బావర్చి వద్దకు చేరుకున్నారు. ఇరుపక్షాలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో బావర్చీ రెస్టారెంట్ వద్ద వాతావరణం మరింత వేడెక్కింది. రెండు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో భోజనం చేయడానికి వచ్చిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఊహించని పరిణామంతో కస్టమర్లు భోజనం మధ్యలోనే వదిలేసి రెస్టారెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు.

హోటల్ లోపల పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉండటంతో రెస్టారెంట్ యాజమాన్యం తక్షణమే షట్టర్లు వేసింది. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేయడానికి ప్రయత్నించారు. నిరసన తెలుపుతున్న బీఆర్‌ఎస్ నాయకులను హోటల్ నుంచి బయటకు పంపించారు. బయటికి వెళ్తోన్న బీఆర్‌ఎస్ నేతల వాహనాలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. వాటిపై దాడి చేశారు. దీంతో కొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం అందింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+