ఈ సినిమా చూస్తే యూత్ ఫిదా అవ్వాల్సిందేనా?
నేటి తరం యువత అభిరుచులకు తగ్గట్టుగా.. ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'సిద్దుగాడి లవ్ స్టోరీ'. మనోజ్, శృతి, మోహన సిద్ది ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు రమేష్ బాబు చెరుకూరు దర్శకత్వం వహిస్తున్నారు. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో సావిత్రమ్మ చెరుకూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 27న(శుక్రవారం) ఘనంగా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి సినీ విశేషాలను పంచుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినిమా బృందం కథాంశం, తమ పాత్రల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ.. "సినిమాలంటే నాకు ఎంతో ప్యాషన్. ఆ ఇష్టంతోనే ఈ స్టోరీని రూపొందించాను. కేవలం యూత్‌కు మాత్రమే కాకుండా.. ఫ్యామిలీ అభిమానులకు కూడా నచ్చేలా అన్ని అంశాలను మేళవించాం. ఈ నెల 27న వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాను" అని వెల్లడించారు.

హీరో మనోజ్ మాట్లాడుతూ.. "ఇందులో సిద్ధు పాత్రలో కనిపిస్తాను. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న పక్కా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఇది. బీటెక్ పూర్తయ్యాక కొత్త జీవితానని ప్రారంభించాలని నగరాలకు వచ్చే యువత ఎదుర్కొనే సమస్యలను ఇందులో చూపిస్తున్నాం. వ్యక్తిగతంగా నేను కూడా అలాగే హైదరాబాద్ వచ్చాను. అందుకే ఈ స్టోరీకి, పాత్రకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. పాటలు కూడా అదిరిపోయాయి" అని అన్నారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ .. "ఈ సినిమాలో అల్లరి అమ్మాయిగా కనిపిస్తాను. కథ ప్రారంభంలో బబ్లీగా ఉండే ఆ తర్వాత నేను హీరో కోసం మారిపోతాను. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి చిత్రమిది. మీ అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాం" అని అన్నారు.
రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. "లైఫ్ ను ఎంజాయ్ చేసేందుకు చాలా మంది యూత్ నగరాలకు వెళ్తుంటారు. అలా వెళ్లాక వాళ్లు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది మా మూవీలో ఇంట్రెస్టింగ్‌గా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చూపిస్తున్నాం. యూత్ అందరికీ మా సినిమా బాగా నచ్చుతుంది." అని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ .. "యూత్‌కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి. అలాంటి కంటెంట్‌తో వస్తున్న మా సిద్ధుగాడి లవ్ స్టోరీ కూడా మీ ఆదరణ పొందుతుంది." అని విశ్వాసం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
