C-PAC Exit Poll: ఏపీ మున్సిపల్ పోరులో సీన్ రివర్స్ -తొలిదశతో పోలిస్తే అనూహ్య ఫలితాలు ..!
ఏపీలో ఇవాళ జరిగిన రెండో దశ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో మొత్తం నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లు, మరో 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో ఓటరు నాడి ఎలా ఉందన్న దానిపై సీ ప్యాక్ సంస్థ ఎగ్జిట్ పోల్ (C-PAC Exit Poll) ఫలితాలను విడుదల చేసింది. వీటిలో రెండో దశ మున్సిపల్ ఎన్నికల్లో తొలి దశ ఎన్నికలకు భిన్నంగా ఫలితాలు రాబోతున్నట్లు సీ ప్యాక్ అంచనా వేసింది. అందుకు గల కారణాలను కూడా స్పష్టంగా వెల్లడించింది.
సీ ప్యాక్ అంచనా ప్రకారం ఇవాళ ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపల్ కార్పోరేషన్లలో మూడు చోట్ల విపక్ష వైఎస్సార్సీపీ గెలువబోతున్నట్లు తేల్చింది. వైఎస్సార్సీపీ మేయరు సీట్లు గెలిచే కార్పోరేషన్లలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ లో మాత్రం టీడీపీ గెలుస్తుందని తెలిపింది. అలాగే మొత్తం 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్సార్సీపీకి 10 చోట్ల, టీడీపీకి 7 చోట్ల, జనసేనకు రెండు చోట్ల విజయం లభిస్తుందని అంచనా వేస్తోంది.

మరోవైపు కాకినాడ కార్పోరేషన్ లో 66 డివిజన్లలో కూటమి తాండవం చేయబోతున్నట్లు సీ ప్యాక్ అంచనా వేసింది. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగా మేయర్ సీటు మాత్రం వైఎస్సార్సీపీకి దక్కబోతున్నట్లు తెలిపింది. క్రాస్ ఓటింగ్ లో గెలుస్తున్న ఫ్యాన్, మాస్ ఓటింగ్ లో ఓడిపోతున్న కూటమి, అన్ని పోలింగ్ బూత్ లలోనూ వైసీపీ హవా కనిపించినట్లు పేర్కొంది. అలాగే రాజమహేంద్రవరం కార్పోరేషన్లో 72 డివిజన్లలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సీ ప్యాక్ తెలిపింది. బీజేపీ ఓటింగ్ కు బ్రాహ్మణులు, కమ్మవారు దూరమయ్యారని తెలిపింది. ఇక్కడ మేయర్ ప్లస్ కార్పోరేటర్ల స్ధానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని తెలిపింది. తాడేపల్లి-మంగళగిరి కార్పోరేషన్లో మేయర్ తో పాటు అన్ని డివిజన్లలోనూ కూటమి తాండవం చేసిందని తెలిపింది. చివరిగా శ్రీకాకుళం కార్పోరేషన్లో అన్ని డివిజన్లలోనూ ఫ్యాన్ హవా కనిపించిందని, మేయర్ తో పాటు కార్పోరేటర్ సీట్లను కూడా వైఎస్సార్సీపీ ఎక్కువగా కైవసం చేసుకుంటుందని తెలిపింది.












Click it and Unblock the Notifications
