హైదరాబాద్ లో ఇల్లు కొంటున్నారా..? ఈ ఒక్క విషయం తెలుసుకోండి..

హైదరాబాద్ విశ్వ నగరంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే. భాగ్య నగరానికి వందల ఏళ్ల గణనీయమైన చరిత్ర ఉంది. అలాగే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది. 2026 వరల్డ్ బెస్ట్ సిటీస్ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా 82వ స్థానంలో నిలిచింది. అటు సావిల్స్ గ్రోత్ హబ్స్ ఇండెక్స్ ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచ నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. అలాగే హెన్లీ అండ్ పార్ట్ నర్స్ సంస్థ వెల్లడించిన రిచెస్ట్ సిటీస్ లిస్టులో హైదరాబాద్ 65 వ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక భాగ్యనగరం జనాభా గణనీయంగా పెరుగుతోంది. 2026 అంచనాల ప్రకారం హైదరాబాద్ జనాభా కోటీ 30 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం అందుతోంది. ఉపాధి, ఉద్యోగాల వేట కోసం దేశంలోని అనేక రాష్ట్రాల నిత్యం వేలాదిమంది హైదరాబాద్ కు తరలివస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో సొంతిళ్లు లేక హాస్టల్స్, రెంట్ ఇళ్లలో జీవనం సాగిస్తుంటారు.

అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో ఇల్లు కొనాలంటే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2025 లో హైదరాబాద్ లో సగటు ఇంటి ధర రూ. కోటీ 94 లక్షలు ఉండగా ఈ ఏడాది సగటు ఇంటి ధర రూ. 2 కోట్ల 15 లక్షలకు పైనే పలుకుతోంది. అంటే గతేడాదితో పోల్చితే ఇళ్ల ధరలు దాదాపు రూ. 20 లక్షలకు పైనే పెరిగినట్లు స్పష్టం అవుతోంది. ఇక హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయి. భూముల ధరల గణనీయంగా పెరగడం.. ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్ ఖర్చులు కూడా పెరగడం కారణంగా చెప్పవచ్చు. అలాగే పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు కూడా అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది.

Hyderabad Home prices soaring common man concerned prices rise even though home sales have declined

మరోవైపు పెరిగిన ధరల నేపథ్యంలో ఇళ్ల కొనుగోలు సంఖ్య తగ్గిపోయింది. ఇటీవలికాలంలో ఇళ్ల అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ధరలు మాత్రం భారీగానే పెరుగుతుండటం గమనార్హం. దాంతో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య పెరుగుతోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా అందించిన తాజా నివేదిక ప్రకారం.. 2026 మూడో త్రైమాసికంలో నగరంలో అమ్ముడుపోని నివాస గృహాల ఇన్వెంటరీ 7 శాతం మేర పెరిగినట్లు స్పష్టం చేసింది. మార్కెట్ డిమాండ్‌ ను మించి కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడమే ఇందుకు ప్రధాన కారణంగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్య ప్రజలకు హైదరాబాద్ లో సొంతింటి కల కలగానే మిగిలిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+