Nanna Kutty Movie Review: విజయ్ ఆంటోనీ ఏడిపించేశాడు భయ్యా.. 'బిచ్చగాడు' కు మించిన ఎమోషన్..!

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ అనగానే టక్కున గుర్తొచ్చే సినిమా 'బిచ్చగాడు' ఆయన కెరీర్ గురించి చెప్పాలంటే బిచ్చగాడు.. తర్వాత బిచ్చగాడు ముందు అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఓవర్ నైట్ సెన్సేషన్ అయ్యారు విజయ్ ఆంటోనీ. ఈ మూవీ తమిళంలోనే కాదు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. తెలుగులో బిచ్చగాడు సినిమాకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అలా ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. బిచ్చగాడు సినిమా తర్వాత యమన్, అన్నాదురై, కాళి, తిమురుపుడిచవన్, బిచ్చగాడు 2 లాంటి చిత్రాలతో అలరించారు. అలాగే గతేడాది మార్గన్ తో ఈ ఏడాది వంద దేవుళ్లు సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు విజయ్ ఆంటోనీ. అయితే ఇవేవీ బిచ్చగాడు సినిమా స్థాయిలో విజయం, గుర్తింపు తీసుకురాలేదు. ఈ క్రమంలోనే తాజాగా 'అప్పా కుట్టి' అనే ఎమోషనల్ స్టోరీతో వస్తున్నారు. ఈ మూవీ తెలుగులో 'నాన్న కుట్టి' అనే టైటిల్ తో నవంబర్ 27న విడుదల కానుంది.

ఈ మూవీలో విజయ్ ఆంటోనీతోపాటు ప్రీతీ అశ్రాణీ, లితన్య, భగవతి పెరుమాళ్, హరి ప్రియా ఇసై, అరవి మదన్, లీజి ఆంటోనీ తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎం యూ మారన్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే నాన్న కుట్టి సినిమాను సర్వాంత్ రామ్ క్రియేషన్స్ , రామాంజనేయులు జవ్వాజి ప్రొడక్షన్స్ తో పాటు విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ నిర్మాణ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలోని పుణెలో జరిగిన నిజ జీవిత సంఘటనలకు కొన్ని కల్పితాలను జోడించి ఈ చిత్రాన్ని తీసినట్లు స్పష్టం అవుతోంది.

నాన్న కుట్టి మూవీలో విజయ్ ఆంటోనీ సూర్య అనే పాత్రలో మెప్పించారు. అలాగే చిన్నారి లితన్య.. సూర్య కుమార్తె దియాగా నటించింది. ఇక ప్రీతీ అస్రాణి.. దియా స్కూల్ టీచర్ అనిత పాత్రలో నటించింది. దియాకు నాన్న మాత్రమే ఉంటారు. తల్లి ఉండదు. ఇక దియా అంటే నాన్న సూర్యకు ప్రాణం. మరోవైపు అనిత.. సూర్యను పెళ్లిచేసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అలాగే దియాను తన కూతురిగా భావిస్తుంటుంది. ఈ క్రమంలోనే చిన్నారి దియాకు ఓ ప్రాణాంతక వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆ వ్యాధి నుంచి బయటపడాలంటే దియా తల్లితండ్రులు ఇంకో బిడ్డని కనాలని.. లేదంటే దియా చనిపోతుందని వైద్యులు చెబుతారు. అదే సమయంలో అసలు దియా సూర్య కూతురు కాదని తెలుస్తుంది.

VijayAntony First review movie Nanna Kutti an emotional depth that surpasses Bichagadu movie

ఇక దియా పేరెంట్స్ ఎవరో కూడా సూర్యకు తెలియదు.. మరి దియా ఎవరు..? ఆమె తల్లిదండ్రులు ఎవరు..? దియా సూర్య వద్ద ఎందుకు ఉంది..? చివరకు దియా ప్రాణాలతో బయటపడిందా..? ఇలాంటి ఆసక్తికర కథనంతో స్టోరీ సాగుతుంది. ఈ సినిమాలో బిచ్చగాడుకు మించిన ఎమోషనల్ సీక్వెన్స్ లు ఉన్నట్లు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నవంబర్ 27 న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+