రాయలసీమ లిఫ్ట్ లో ఇదీ జరిగింది.. అసలు విషయం బయట పెట్టిన జగన్..!!

రాయలసీమ లిఫ్ట్ స్కీం పైన మాజీ సీఎం జగన్ స్పందించారు. స్పష్టత ఇచ్చారు. కీలక అంశాల ను వెల్లడించారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ మాటల యుద్దం వేళ జగన్ ఈ స్కీం వెనుక అసలు అంశాలను వివరించారు. జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదేనని స్పష్టం చేసారు. సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వాల్సి ఉన్నా.. కాంగ్రెస్ తో హాట్ లైన్ దోస్తీ వలన మౌనంగా ఉన్నారని ఆరోపించారు.

రాయలసీ లిఫ్ట్ స్కీం పైన తెలంగాణలో రాజకీయ చర్చ జరుగుతోంది. పార్టీ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఇదే అంశం పైన స్పందిస్తూ మాజీ సీఎం జగన్ ట్వీట్ లో కీలక అంశాలు ప్రస్తావన చేసారు. అందులో.." రాయలసీమ లిఫ్ట్‌ స్కీంపై, తెలంగాణలో పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం వాస్తవాలను మరుగున పరుస్తోంది. దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన @ncbn తన హాట్‌లైన్‌ కాంగ్రెస్‌తో దోస్తీ రాజకీయాలకోసం మౌనంగా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌ స్కీం కొత్త ప్రాజెక్టు కాదు! దీనికి అదనపు నీటి కేటాయింపులు లేవు, కొత్త కాల్వలు లేవు, అదనపు రిజర్వాయర్లు లేవు, అదనపు ఆయకట్టూ లేదు! అదే కృష్ణానది, అవే నీళ్లు, అవే కేటాయింపులు, అదే పోతిరెడ్డిపాడు నుంచి అవే కాల్వల ద్వారా దుర్భిక్ష పరిస్థితులను తరచుగా ఎదుర్కొనే, అవే రాయలసీమ ప్రాజెక్టు లకు కేటాయించిన, అవే జలాలనే సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఒక ఇన్సూరెన్స్‌ స్కీం లాంటిదే ఈ పథకం.." అంటూ వివరించారు.

 జగన్ సొంత ఊరులో టీడీపీ గెలుపు - 40 ఏళ్ల తర్వాత..!!
జగన్ సొంత ఊరులో టీడీపీ గెలుపు - 40 ఏళ్ల తర్వాత..!!
ys-jagan-clarifies-stand-on-rayalaseema-lift-irrigation-scheme-amid-telangana-parties-criticism

తాజా డైలాగ్ వార్ వేళ క్లారిటీ

దీనికి కొనసాగింపుగా.. " కొన్ని దశాబ్దాలుగా కృష్ణానది ద్వారా రాష్ట్రానికి వచ్చే నీళ్లు తగ్గిపోతున్న నేపథ్యంలో, పైనుంచి నీళ్లు రాకపోవడం ఒక సమస్య అయితే, వచ్చిన ఆ నీటిని కూడా తెలంగాణ రాష్ట్రం విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో ఇష్టానుసారంగా దిగువకు వదిలేయడం మరొక తీవ్రమైన సమస్య. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా, శ్రీశైలం నుంచి పూర్తిస్థాయిలో, అంటే 44వేల క్యూసెక్కు ల నీళ్లు పారాలంటే శ్రీశైలంలో నీటిమట్టం కనీసం 880 అడుగులపైన ఉండాలి. ఆ నీటి మట్టం 854 అడుగుల దిగువకు పడిపోతే అసలు నీళ్లే పంపలేం. ఆ 880 అడుగులపైన రిజర్వాయర్‌ లెవల్‌ ఎన్నిరోజులు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి. దీనివల్ల రాయలసీమ తాగునీటి, సాగునీటి అవసరాలు తీరడం అసాధ్యంగా మారుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రం శ్రీశైలంలో 800 అడుగుల నుంచే నీటిని తీసుకు నేందుకు, పాలమూరు-రంగారెడ్డి ద్వారా రోజుకు 1.5 టీఎంసీలు, డిండి ద్వారా 0.5 రోజుకు టీఎంసీ, కల్వకుర్తి ద్వారా రోజుకు 0.4 టీఎంసీ , ఎస్‌ఎల్‌బీసీ ద్వారా రోజుకు 0.5 టీఎంసీ, మొత్తంగా దాదాపుగా రోజుకు 3 టీఎంసీలు తరలించే సామర్థ్యంతో జోరుగా ముందు కెళ్తోందని.." విశ్లేషించారు.

 శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!
శ్రీవారికి 121 కిలోల బంగారం ఇచ్చిన వర్థమాన్ జైన్ - ఆస్తుల విలువ, ఇదీ నేపథ్యం..!!

ఎవరికీ నష్టం కలిగించదు

కాగా.." వీటికి తోడు 800 అడుగుల నుంచే విద్యుత్‌ ఉత్పత్తి పేరిట నీటిని వదిలేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను చేపట్టాం. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తీసుకోలేని సంక్లిష్టమైన పరిస్థితుల్లో లిఫ్ట్‌ చేసి, అదే పోతిరెడ్డిపాడు కాల్వలోకి నీటిని ఎత్తిపోసి, ఇప్పటికే ఉన్న పాత రిజర్వాయర్లకు చేరవేయడమే ఈ పథకం ఉద్దేశం. నీటి కేటాయింపులు ఉన్నా, వినియోగించుకునే అవకాశం లేకపోతే ఆ కేటాయింపులకు సార్థకత ఏముంటుంది? అదనపు నీటి కేటాయింపులు, అదనపు రిజర్వాయర్లు లేనప్పుడు ఈ పథకం వల్ల ఎవరికి, ఏం నష్టం వస్తుంది? ప్రజల దాహార్తిని తీర్చే ఇన్సూరెన్స్‌ లాంటి రాయలసీమ లిఫ్ట్‌ స్కీంను భూతద్దంలో చూపించడం భావ్యమా? దురదృష్ట వశాత్తూ, దాదాపుగా పూర్తయిన రాయలసీమ లిఫ్ట్‌ పనులను చంద్రబాబు అధికారంలోకి రాగానే, ఎక్కడ జగన్‌కు పేరువస్తుందోనని ఆపేశారు. ఈ పథకాన్ని పూర్తిచేయాల్సింది పోయి, ఎవరైనా అభ్యంతరం చెప్తే, దాని ఆవశ్యకతను బలంగా వినిపించాల్సిందిపోయి, హాట్‌లైన్‌ రాజకీయాలకోసం బలిపెట్టారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరువులాంటి విపత్కర పరిస్థితుల్లో హక్కుగా కేటాయించిన నీటిని కూడా వినియోగించుకునే అవకాశాన్ని దెబ్బతీసి, రాయలసీమ ప్రజల ప్రాణాధారానికే ఉరివేశాడు. ఎవరికీ నష్టం కలిగించని ఈ పథకంపై అనవసర ఆరోపణలు చేయడం సరికాదు..." అని జగన్ వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+