పురుష ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. 15 రోజుల పాటు పితృత్వ సెలవులు..

పురుష ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15 రోజుల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురుష ప్రభుత్వ ఉద్యోగులకు ఇలా పితృత్వ సెలవులు ఇవ్వడం రాష్ట్రంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ మేరకు తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాహం అయిన పురుష ఉద్యోగులకు బిడ్డ పుడితే 15 రోజుల పాటు పితృత్వ సెలవులకు అర్హులు కానున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో మాతృత్వ ప్రయోజన చట్టం, 1961 ప్రకారం తల్లి అయిన మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు 26 వారాల వేతనంతో కూడిన సెలవులను పొందే వెసులుబాటు ఉంది. అయితే తమిళనాడులోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు మ్యాటెర్నిటీ లీవ్ ను ఏకంగా 365 రోజుల పాటు అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఇక తాజాగా పురుష ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం విజయ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఇక అధికారిక ఉత్తర్వుల ప్రకారం.. ఈ పితృత్వ సెలవులను అర్హత కలిగిన ఉద్యోగులు డెలివరీ డేట్ కు 15 రోజుల ముందు నుంచి తీసుకోవచ్చు. లేదా బిడ్డ పుట్టిన మొదటి ఆరు నెలల వరకు తీసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ప్రెగ్నెన్సీ అలాగే డెలివరీ టైమ్ లో భార్యకు ఫిజికల్ గా అలాగే ఎమోషనల్ గా అందుబాటులో ఉండటం.. అలాగే బిడ్డ పుట్టాక వారితో కలిసి కాస్త టైమ్ స్పెండ్ చేయడం కోసం ఈ పాలసీని తీసుకొచ్చినట్లు స్పష్టం అవుతోంది. ఇక ఇప్పటికే తమిళనాడులోని మహిళా ఉద్యోగులకు 365 రోజులు మాతృత్వ సెలవులు ఉండగా.. ఇప్పడు తాజాగా పురుష ఉద్యోగులకు కూడా 15 రోజుల పాటు పితృత్వ సెలవులు ఇవ్వడంతో బిడ్డను పెంచే బాధ్యతలో తల్లితోపాటు తండ్రి పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యతను వివరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లుగా భావించవచ్చు.

TamilNadu Good news for male government employees in Tamil Nadu 15 days of paternity leave latest

ఈ నిర్ణయంతో ఇప్పటికే పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మాతృత్వ సెలవులు వర్తింపజేస్తున్న కేరళ, సిక్కిం, హరియాణా రాష్ట్రాల సరసన తమిళనాడు చేరింది. ఇక తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది పురుష ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనుంది. తాజాగా సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై ఆ ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+