సీజేపీ కీలక నేతపై లుక్ అవుట్ సర్కులర్-ఢిల్లీ హైకోర్టులో కేంద్రం షాకింగ్..!

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ కు (Saurav Das) ఇవాళ ఢిల్లీ హైకోర్టులో కేంద్రం షాకిచ్చింది. తాజాగా లండన్ వెళ్తుండగా ఆయన్ను ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏ కారణం చేత అడ్డుకున్నారో చెప్పలేదని, దీనిపై తగు ఆదేశాలు ఇవ్వాలంటూ సౌరవ్ దాస్ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఢిల్లీ హైకోర్టు విచారణ జరిపింది. ఇందులో కేంద్రం ఆయనపై లుక్ అవుట్ సర్కులర్ పెండింగ్ లో ఉన్నట్లు వెల్లడించింది.

మళ్లీ టారిఫ్ ల మోత మోగించబోతున్న ట్రంప్..! భారత్ సహా పలు దేశాలకు షాక్?
మళ్లీ టారిఫ్ ల మోత మోగించబోతున్న ట్రంప్..! భారత్ సహా పలు దేశాలకు షాక్?

మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లుక్ అవుట్ నోటీసు పెండింగ్ లో ఉన్న కారణంగానే సౌరవ్ దాస్ ను ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నారని, ఆయన దీన్ని తగిన న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశం ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అయితే ఇప్పటివరకూ సౌరవ్ దాస్ కు లుక్ అవుట్ సర్కులర్ కాపీ ఇవ్వలేదని ఆయన న్యాయవాది అఖిల్ సిబాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ఏఎస్జీ.. ఎల్ఓసీ కాపీని ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీ హైకోర్టు కేంద్రం స్పందన కోరుతూ నోటీసులు జారీ చేసింది.

CJP Leader Saurav Das Faces Look Out Circular Centre Flags Passport Discrepancies in Citizenship Row
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

చెన్నై ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి సౌరవ్ దాస్ జన్మస్థలం తేడా ఉందంటూ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆయన స్పందించలేదని ఏఎస్జీ తెలిపారు. అయితే షోకాజ్ నోటీసుకు సమాధానం ఇవ్వకపోతే విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటారా అని సౌరవ్ దాస్ న్యాయవాది అఖిల్ సిబాల్ ప్రశ్నించారు. కొన్ని వివరాలు దాచి సౌరవ్ దాస్ ఈ పాస్ పోర్టు పొందినట్లు ఈ నోటీసు జారీ చేశారని, దీనిపై వివరణ తీసుకుని, అది సంతృప్తికరంగా లేకపోతే పాస్ పోర్టు రద్దు చేసే అవకాశం ఉందన్నారు. అలా చేయకుండా ఇలా విదేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని అఖిల్ సిబాల్ నిలదీశారు. దీంతో కేంద్రం స్పందన వచ్చాక తదుపరి విచారణ జరపాలని నిర్ణయించిన ఢిల్లీ హైకోర్టు .. ఈ కేసును డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+