Mohammed Siraj: కివీస్ తో రెండో టెస్టులోనూ సిరాజ్ కష్టమే..! క్లారిటీ ఇచ్చేశారా ?

న్యూజీలాండ్ టూర్ లో భాగంగా వెల్లింగ్టన్ లో ఆతిధ్య జట్టుతో జరిగిన తొలి టెస్టుకు అనూహ్యంగా దూరమైన టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు రెండో టెస్టుకూ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిటెస్టులో సిరాజ్ ను ఎంపిక చేయకపోవడం, తొలి ఇన్నింగ్స్ లో బౌలర్లు విఫలం కావడం, రెండో ఇన్నింగ్స్ లో సైతం చేతులెత్తేయడంతో టీమ్ ఎంపికపై ప్రశ్నలు తలెత్తాయి. గవాస్కర్, రవిశాస్త్రి సహా పలువురు దిగ్గజాలు ఈ నిర్ణయాన్ని తప్బుబట్టారు. అయినా రెండో టెస్టులోనూ సిరాజ్ ఎంపిక కావడం కష్టమేనని తెలుస్తోంది.

సిరాజ్ ను తీసుకోకపోవడంపై విమర్శలు..! స్పందించిన బౌలింగ్ కోచ్..!
సిరాజ్ ను తీసుకోకపోవడంపై విమర్శలు..! స్పందించిన బౌలింగ్ కోచ్..!

రేపు క్రైస్ట్ర్ చర్చ్ లో కివీస్ తో రెండో టెస్టు ప్రారంభం కాబోతోంది. ఇందులోనూ సిరాజ్ కు అవకాశం దక్కడం కష్టమేనని బౌలింగ్ కోచ్ మోర్న్ మోర్కెల్ వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. సిరాజ్ ప్రపంచ స్థాయి బౌలర్ అని అంగీకరిస్తూనే మోర్నెల్.. అతను తన ఆటను పునస్సమీక్షించుకుని తిరిగి జట్టులోకి రావడానికి సరైన మార్గం వెతుక్కోవాలని సూచించారు. తన దృష్టిలో సిరాజ్ బాగానే బౌలింగ్ చేస్తున్నాడని, అయితే జట్టులో ఎంపిక అనేది చాలా కష్టమైన నిర్ణయం అన్నారు. అదంత సులభం కాదన్నారు. తాము అతనితో నిరంతర సంప్రదింపులు జరుపుతూనే ఉన్నామని మోర్కెల్ తెలిపారు.

No Mohammed Siraj in 2nd Test Too World-Class Pacer Faces Fresh Setback
కివీస్ టెస్టుకు సిరాజ్ డ్రాప్ లో మరో టర్న్- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ..!
కివీస్ టెస్టుకు సిరాజ్ డ్రాప్ లో మరో టర్న్- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ..!

మోర్కెల్ సిరాజ్ తో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్ధితి ఒకసారి గమనిద్దామని తెలిపారు. మనం ఎక్కడున్నామో చూసుకుని,, ఎక్కడ మెరుగుపడాలో ఆలోచిద్దామని చెప్పారు. జట్టు ఎంపిక మన చేతుల్లో లేదని, కానీ ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లకు మద్తుగా నిలవడం తమ చేతుల్లో ఉందన్నారు. అది సరైన పద్దతి కూడా అన్నారు. ఎందుకంటే వారికి కూడా భారత్ తరఫున ఆడాలనే కల ఉంటుంది కదా అన్నారు. సిరాజ్ తన వ్యక్తిగత ఆటను విశ్లేషించుకుని, కెరీర్‌లో తర్వాతి అడుగుల కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చూడటమే ఇప్పుడు తమ లక్ష్యమని మోర్కెల్ పేర్కొన్నారు. మరోవైపు వెల్లింగ్టన్ టెస్టులో ఆడిన జట్టులో భారత్ ఓ మార్పు చేసే అవకాశం ఉంది. పేసర్ గుర్నూర్ బ్రార్ ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అతని కోసం ఎవరిని తప్పిస్తారో చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+