కివీస్ టెస్టుకు సిరాజ్ డ్రాప్ లో మరో టర్న్- కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ..!

భారత్-న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టెస్టులో హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Siraj) ను తీసుకోకుండా, పక్కనబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు హెడ్ కోచ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడుతున్నారు. దీని ప్రభావం మ్యాచ్ పై కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో సిరాజ్ డ్రాప్ వివాదం ఇవాళ రాజకీయ మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్దానికి దిగాయి.

Ind vs NZ:
Ind vs NZ:

న్యూజీలాండ్ తో టెస్టు సిరీస్ లో సిరాజ్ ను ఆడించేందుకు అన్ని అవకాశాలున్నా కావాలనే పక్కనబెట్టారనే విమర్శలు పెరుగుతున్నాయి. నిన్న సిరాజ్ ను తీసుకోకపోవడంపై క్రికెట్ దిగ్గజాలు గవాస్కర్, రవిశాస్త్రి, అజారుద్దీన్ విమర్శలు గుప్పించారు. ఈ నిర్ణయం తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇవాళ ఈ వ్యవహారం మరింత ముదిరింది. సిరాజ్ మతమే అతన్ని జట్టు నుంచి తప్పించడానికి కారణమని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యానించారు. అతని పేరు సిరాజ్, అది సరిపోదా అని ఆయన ప్రశ్నించారు. మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ సిరాజ్ ను ఎందుకు తప్పించారని ఆయన నిలదీశారు.

Siraj s Exclusion from India Test Squad Triggers Political Controversy BJP Dismisses Bias Charge
సిరాజ్ ను తీసుకోకపోవడంపై విమర్శలు..! స్పందించిన బౌలింగ్ కోచ్..!
సిరాజ్ ను తీసుకోకపోవడంపై విమర్శలు..! స్పందించిన బౌలింగ్ కోచ్..!

ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఈ వ్యాఖ్యలు మతపరమైనవని, అసంబద్దమైనవని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కొహ్లీ విమర్శించారు. క్రికెట్ సెలెక్షన్స్ జట్టు ప్రాధాన్యతల ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. సిరాజ్‌ను జట్టు నుండి తొలగించడం వెనుక ఉన్న తర్కాన్ని సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి భారత మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశ్నిస్తున్న తరుణంలోనే ఈ వివాదం తలెత్తింది. మరోవైపు ఈ హైదరాబాదీ పేసర్ కివీస్ టూర్ లో భారత జట్టు సభ్యుడిగా ఉన్నాడు. కానీ టెస్టు మ్యాచ్ లో ఆడే తుది జట్టులో తీసుకోలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సిరాజ్ 43 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. గతంలో ఇంగ్లండ్ లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో 23 వికెట్లు తీశాడు. ఇదే అంశాన్ని మాజీ క్రికెటర్లు లేవనెత్తుతుండగా.. జట్టు మేనేజ్ మెంట్ మాత్రం తమ చర్యను సమర్ధించుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+