సిరాజ్ ను తీసుకోకపోవడంపై విమర్శలు..! స్పందించిన బౌలింగ్ కోచ్..!
వెల్లింగ్టన్ లో ఇవాళ ప్రారంభమైన భారత్-న్యూజీలాండ్ తొలిటెస్టులో టీమిండియా తడబడింది. తొలుత విజృంభించిన భారత బౌలర్లు ఆ తర్వాత తేలిపోయారు. దీంతో 70 పరుగులకే ఐదు వికెట్లు తీసిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మాత్రం మరో 173 పరుగులు సమర్పించుకున్నా ఇంకో వికెట్ తీయలేకపోయింది. దీంతో భారత బౌలర్ల సత్తాపై ప్రశ్నలు మొదలయ్యాయి. అదే సమయంలో సీనియర్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (Siraj) అందుబాటులో ఉన్నా ఈ మ్యాచ్ లో తీసుకోకపోవడంపై విమర్శలు చెలరేగాయి. క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తో పాటు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ సైతం ఈ నిర్ణయం తమకు నిరాశ కలిగించిందన్నారు.
భారత జట్టులో మహమ్మద్ సిరాజ్ లేకపోవడం తనకు నిరాశ కలిగించిందని భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ తెలిపారు. ముఖ్యంగా బుమ్రా అందుబాటులో లేని సమయంలో, జట్టుకు అవసరమైన కీలక దశల్లో సిరాజ్ ప్రదర్శించిన తీరు అతని నిబద్ధతను, సామర్థ్యాన్ని, పోరాట పటిమను చాటిచెప్పిందని గుర్తుచేశారు. అతను నిలకడగా రాణిస్తూ దేశం కోసం తన వంతు కృషి చేశాడన్నారు.
మరోవైపు కాంబోజ్‌కు తన శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో సిరాజ్‌కు మరికొంత ప్రాధాన్యత దక్కాల్సిందని అభఇప్రాయపడ్డారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలను, సిరాజ్ కు తగిన గౌరవంతో, స్పష్టతతో వివరిస్తారని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు. గవాస్కర్ కూడా సిరాజ్ ను పక్కనబెట్టాలన్న నిర్ణయం తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించాడు.

Disappointed to see Mohammed Siraj missing from the India squad. His performances, especially when Team India needed him in Bumrah’s absence, have shown his commitment, ability and fighting spirit. He has consistently stepped up and delivered for the country.While I wish Kamboj the very best, I believe Siraj deserved better consideration. I hope this decision is explained to him with the clarity and respect he deserves.
— Mohammed Azharuddin (@azharflicks) November 19, 2026
ఈ నేపథ్యంలో టీమిండియా బౌలింగ్ కోచ్ సీతాన్షు కొటక్ (India Coach Sitanshu Kotak ) విమర్శలపై స్పందించాడు. జట్టు ఎంపిక తొలిరోజు ఆట మాత్రమే కాకుండా ఐదు రోజాల ఆటను దృష్టిలో పెట్టుకుని జరిగిందన్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ విభాగంలో ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, అన్షుల్ కాంబోజ్ లకు చోటు కల్పించామన్నారు. సిరాజ్ కు ఎలాంటి సమస్య లేదన్నారు. జట్టును ఎంపిక చేసేటప్పుడు ఇదే అత్యుత్తమమని తాము భావించామని కొటక్ తెలిపారు. కాబట్టి సిరాజ్ ను పక్కనబెట్టడం తప్పుడు నిర్ణయమని తాను అనుకోబోనన్నారు. కివీస్ టాప్ ఆర్డర్ లో పలువురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండటం వల్లే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నట్లు తెలిపారు. తద్వారా ఈ నిర్ణయాన్ని బౌలింగ్ కోచ్ సమర్ధించుకున్నారు.













Click it and Unblock the Notifications
