పోక్సో కేసులో బండి భగీరథ్‌కు షాక్.. జనవరి 28న హాజరుకు మేడ్చల్ కోర్టు సమన్లు!

తెలంగాణలో సంచలనం సృష్టించిన పోక్సో కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు మేడ్చల్ పోక్సో న్యాయస్థానం తాజాగా సమన్లు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28వ తేదీన విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

ఈ ఏడాది మే నెలలో 17 ఏళ్ల మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. బాలికకు మద్యం తాగించి లైంగికంగా వేధించడంతో పాటు శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాప్తులో లభించిన ఆధారాలు, బాధితురాలి వాంగ్మూలం మేరకు పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు, ఆధారాల తారుమారుకు సంబంధించిన అభియోగాలను జోడించి మే 16న భగీరథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Bandi Bhageerath pocso case Medchal POCSO Court Issues Summons to Bandi Bhageerath Directs Appearance on January 28

అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో అతడిని చర్లపల్లి జైలుకు పంపారు. విచారణ ప్రక్రియలో భాగంగా పోలీసులు భగీరథ్‌ను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. జైలులో ఉన్న సమయంలో బీబీఏ పరీక్షలు రాసేందుకు మల్కాజ్‌గిరి కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా, దాదాపు 55 రోజుల జైలు జీవితం తర్వాత జులై నెలలో తెలంగాణ హైకోర్టులో అతడికి ఊరట లభించింది.

దర్యాప్తు కీలక దశకు చేరుకోవడం, సుమారు 25 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ కె. సుజన ధర్మాసనం కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష వ్యక్తిగత పూచీకత్తు సమర్పించడంతో పాటు పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని ఆదేశించింది. బాధితురాలిని గానీ, సాక్షులను గానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంప్రదించకూడదని, అలాగే ఈ కేసు గురించి మీడియా లేదా సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా!
రేషన్ లబ్దిదారులకు శుభవార్త.. త్వరలో బియ్యంతో పాటు నిత్యావసరాలు కూడా!

మరోవైపు, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసి, రూ.5 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారంటూ భగీరథ్ ఇచ్చిన ప్రతిఫిర్యాదుపై కరీంనగర్ పోలీసులు నమోదు చేసిన కేసులోనూ విచారణ కొనసాగుతోంది. ఇటీవల తమ ప్రతిష్ఠకు భంగం కలిగించే కథనాలను నియంత్రించాలని కోరుతూ భగీరథ్ హైకోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పరిణామాల మధ్య మేడ్చల్ పోక్సో కోర్టు జనవరి 28న హాజరుకావాలని సమన్లు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+