శ్రీవారు ఆదేశించారు.. వర్దమాన్ పాటించారు - కానుకగా ఇచ్చిన ఆభరణాలు ఇవీ...!!
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామికి వర్ధమాన్ జైన్ దంపతులు 121 కిలోల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీకీ ఈ ఆభరణాలను అందించారు. కాగా, శ్రీవారు ఆదేశించడంతోనే తాము ఈ భూరి విరాళం అందించామని వర్ధమాన్ జైన్ దంపతులు పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ చారిత్రక ఘట్టంతో తాను భాగస్వామి అవుతన్నందుకు సంతోషం వ్యక్తం చేసారు. కాగా.. జైన్ సమర్పించిన ఆభరణాలు రేపు (శుక్రవారం) శ్రీవారికి అలంకరించనున్నారు.
తిరుమల పవిత్ర క్షేత్రంలో అపూర్వఘట్టం ఇవాళ ఆవిష్కృతమైంది. తిరుమలేశునికి భారీ ఎత్తున విరాళం సమర్పించిన జైన్ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. వేంకటేశ్వరస్వామి వైభవం మాటల్లో చెప్పలేమని పేర్కొన్నారు. తిరుమల అంటే భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక ఆనందమని చెప్పుకొచ్చారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వజ్రాలు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. రూ.200 కోట్ల విలువైన ఆభరణాలను తిరుమలేశునికి విరాళంగా ఇవ్వడం అపూర్వమైన సంఘటన అని చెప్పుకొచ్చారు. స్వామివారిపై భక్తి, విశ్వాసాలతో జైన్ దంపతులు ఈ బంగారు ఆభరణాలను ఇవ్వడానికి ముందుకు వచ్చారని కొనియాడారు. కాగా, జైన్ శ్రీవారి కోసం 46 రకాల వేర్వేరు బంగారు ఆభరణాలను తయారు చేయించి కానుకగా అందించారు. అందులో శ్రీ పద్మావతీ అమ్మవారికి 15 కేజీల బరువైన వస్త్రం తో సహా పలు ఆభరణాలు ఉన్నాయి.

శ్రీవారికి సమర్పించిన ఆభరణాలు
ప్రధానంగా బంగారు పాద కవచములు -3, బంగారు అందెలు -3, బంగారు పాకడాలతో పాటుగా బంగారంతో చేసిన తులసి పాత్ర హారం, అష్టోత్తర కాసుల మాల, బంగారు చతుర్భుజ లక్ష్మీ హారం, పులిగోరు, అశ్వథ పాత్ర హారము, సాదా వడ్డాణము, గంటల మొలతాడు, బంగారు సూర్యకటారి, కౌస్తుభం, శ్రీవత్సం, మోచేయి, కటి హస్తం, నాగాభరణ వడ్డాణము, గోపు, ఐదు పేటల కంఠీలు 5, చంద్రవంకీ కంఠీ, వైకుంఠ హస్తము, కటి హస్తము, నాగాభరణ కడియాలు 4, భుజ కీర్తులు 3, కర్ణ పత్రములు 3, భావళీలు -3, సాలిగ్రామ హారములు- 3, కమలం తరహా సాలిగ్రామాలు 3, మోపు గల యజ్ఞోపవీతం, శంఖ కవచము, చక్ర కవచము, కిటీపు ముఖపట్టి, కిరీటము, 2,427 కేరట్ల బరువున్న నీలాలు, పుష్యరాగం, కెంపులు, పచ్చలతో శ్రీవత్సం పతకం,238.2 కేరట్ల బరువున్న వజ్రాలను పొదిగిన ఆభరణాలు టీటీడీకి అందచేసారు.













Click it and Unblock the Notifications
