అల్లు అర్జున్ 25 వ సినిమా.. ఎవరూ ఊహించని దర్శకుడితో..?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. పుష్ప-2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్ లో అల్లు అర్జున్ పలు మార్పులు చేశారు. పాన్ ఇండియా లెవెల్ స్టోరీస్ కు ఓకే చెప్తున్నారు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నారు. వీరితో పాటు రష్మిక మందాన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిథి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తోనూ అల్లు అర్జున్ ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. AA23 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. అయితే కథ ఏంటి, బన్నీ ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరోవైపు సినిమాకు అధికారిక టైటిల్ ను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ప్రకటించలేదు. అలాగే అల్లు అర్జున్ 24 వ సినిమా ఇంకా అధికారికంగా కన్ఫామ్ కాలేదు. అయితే ఇటీవల టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను అల్లు అర్జున్ కు ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ పై బన్ని ఆసక్తి చూపిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే బన్నీ ఈ మూవీని ఓకే చేస్తే ఇది ఆయన కెరీర్ లో 24 వ సినిమా అవుతుంది.

ఇక అల్లు అర్జున్ కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా వస్తున్న 25 వ సినిమా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే మలయాళం దర్శకుడు బాసిల్ జోసెఫ్ పేరు ఇప్పుడు వినిపిస్తోంది. బన్నీతో సినిమా చేసేందుకు ఆసక్తి ఉందని గతంలో బాసిల్ హింట్ ఇచ్చారు. దాంతో అల్లు అర్జున్ 25 వ సినిమాకు ఆయనే దర్శకుడు అని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications
