ఒక్క లాటరీతో కోటీశ్వరులు అయ్యే అవకాశం.. రూ. 450 తో రూ. 25 కోట్ల జాక్ పాట్..!

రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని చాలా మందికి కోరికగా ఉంటుంది. కానీ ఆ అదృష్టం ఎవరికో ఒక్కరికి మాత్రమే దక్కుతుంది. ఆ లిస్టులో మీరు కూడా ఉండే అవకాశం లేకపోలేదు.. అవును క్రిస్మస్‌, న్యూ ఇయర్ సందర్భంగా కేరళ ప్రభుత్వం బంపర్ లాటరీని ప్రకటించింది. ఈ బంపర్ లాటరీలో తొలి బహుమతిగా రూ. 25 కోట్లు అలాగే రెండో బహుమతిగా 24 మందికి రూ. కోటి చొప్పున అందనుంది.

అలాగే మూడో బహుమతిగా మరో 24 మందికి రూ.10 లక్షల చొప్పున అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు మొత్తం 7,66,992 బహుమతులు విజేతలను వరించనున్నాయి. ఇక గతేడాది తొలి బహుమతి రూ. 20 కోట్లు ఉండగా రాష్ట్ర లాటరీ శాఖ ఈ ఏడాది మరో ఐదు కోట్ల పెంచి రూ. 25 కోట్లుగా ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 26 న కేరళ సీఎం వీడీ సతీషన్ ఈ లాటరీని అధికారికంగా ప్రారంభించారు.

ఈ లాటరీ టికెట్ ధరను రూ. 450 గా నిర్ణయించారు. ఇక ఈ ఏడాది నవంబర్ 28 నుంచి లాటరీ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. డ్రా తేదీ ఫిబ్రవరి 1, 2027 గా ఉంది. ఆ రోజు తిరువనంతపురంలో డ్రా తీస్తారు. మొత్తం ఒక కోటీ 8 లక్షల టికెట్లను విక్రయించనున్నట్లు సమాచారం. ఇక టికెట్లను అధికారిక లాటరీ ఏజెంట్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్‌ లైన్ విక్రయాలు చట్టబద్ధం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈసారి మొత్తం 12 సిరీస్ లలో లాటరీ టికెట్లను విడుదల చేయనున్నారు. ప్రతి సిరీస్ లో టికెట్ నెంబర్ల ఆధారంగా బహుమతులను నిర్ణయిస్తారు.

Kerala Bumper Lottery Rs 25 crore ticket price of just Rs 450 know how much winner actually gets

ఇక విజేతకు తొలి బహుమతిగా రూ. 25 కోట్లు ప్రకటించినా.. చివరికి అతని చేతికి రూ. సుమారు రూ.12.88 కోట్లు మాత్రమే వస్తాయి. ఏజెంట్ కమిషన్, టీడీఎస్, సర్‌ ఛార్జ్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఇలా అన్నీపోను చివరకు విజేత చేతికి రూ.12.88 కోట్లు మాత్రమే వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+