ఎల్లుండి.. తిరుమల పార్వేట మండపంలో.. !!

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం నాడు 74,873 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 2,810 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.38 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 12 కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 12 నుండి 14 గంటల సమయం పట్టింది.

కాగా.. పవిత్ర కార్తీకమాసాన్ని పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన ఆదివారం కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనుంది టీటీడీ. తిరుమల గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో ఇది ఏర్పాటుకానుంది. ఇందులో భాగంగా ఉదయం 8: 30 గంటలకు చిన్న గజవాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు, పల్లకిపై ఉభయనాంచారులు ఆలయం నుంచి మంగళవాయిద్యాల, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా బయలుదేరి పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు.

Karthika Vana Bhojanam will be conducted by TTD in Paruveta Mandapam near Gogarbham on November 29

ఉదయం 11 నుండి 12 గంటల వరకు టీటీడీ అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2 గంటల వరకు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భక్తులకు అన్నప్రసాదాలను అందజేయనున్నారు.

ఉచిత విద్యుత్, ప్రతి నెలా రూ. 5,000 నిరుద్యోగ భృతి: రూ. 40,000 పెన్షన్: రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు
ఉచిత విద్యుత్, ప్రతి నెలా రూ. 5,000 నిరుద్యోగ భృతి: రూ. 40,000 పెన్షన్: రాష్ట్రవ్యాప్తంగా క్యాంటీన్లు

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్, కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు డాక్టర్ శ్రీకాంత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో మురళీ కృష్ణ, టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. కార్తీక వనభోజనం కార్యక్రామన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీ శ్రీవారి అలయంలో నిర్వహించనున్న కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకారసేవలను రద్దు చేసింది.

త్వరలో బంగ్లాదేశ్ ను ఆక్రమించుకుంటాం: సీఎం సువేందు కేబినెట్ మంత్రి వెల్లడి: డెడ్ లైన్
త్వరలో బంగ్లాదేశ్ ను ఆక్రమించుకుంటాం: సీఎం సువేందు కేబినెట్ మంత్రి వెల్లడి: డెడ్ లైన్

శ్రీనివాసమంగాపురంలో కూడా కార్తీక వనభోజనం కార్యక్రామన్ని నిర్వహించనుంది టీటీడీ. శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉంటుంది. డిసెంబరు 5వ తేదీన ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య ఆలయం నుంచి శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు.

సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన తమిళనాడు ప్రభుత్వం

ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. భక్తులలో ఆధ్యాత్మిక భావనను పెంపొందించేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు తిరిగి ఆలయానికి చేరుకుంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+