మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోన్నారు.. !!

ఏపీలో మలి విడత మున్సిపాలిటీలు, మొదటి విడత పంచాయతీ రాజ్ ఎన్నికల పోలింగ్ లో తెలుగుదేశం కూటమి హవా కొనసాగింది. మొత్తం 3,949 పంచాయతీల్లో కూటమి మద్దతుదారులు 2,600కుపైగా స్థానాల్లో విజయం సాధించారు. మిగిలిన చోట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సత్తా చాటింది. వైసీపీ బలపరచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో విజయం సాధిస్తోన్నారు.

పోలింగ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక పరిస్థితులపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. కూటమి వ్యవహారాన్ని ఆయన ఎండగట్టారు. దీనిపై ఓ ట్వీట్ చేశారు.

YS Jagan made key remarks on Ruling TDP led Andhra Pradesh Government over Panchayat Raj Polling

ఎన్నికల్లో అక్రమాలు జరిగిన ప్రతి చోటా మళ్లీ పోలింగ్ నిర్వహించాలని, బాధ్యులైన టీడీపీ నేతలు, పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని జగన్‌ డిమాండ్‌ చేశారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే ఓటర్లను బెదిరించడం, తమ పార్టీకి చెందిన పోలింగ్ ఏజెంట్లపై దాడులు చేసి, వారిని అడ్డుకోవడం.. పోలింగ్ కేంద్రాల నుంచి బ్యాలెట్ పత్రాల ఎత్తుకెళ్లడం, పోలీసుల, ఎన్నికల సిబ్బంది సహకారంతో భారీగా రిగ్గింగ్ కు పాల్పడటం వంటి ఘటనలు ఇష్టానుసారంగా సాగాయని అన్నారు.

రాత్రి బావర్చీ రెస్టారెంట్ లో బీఆర్ఎస్- కాంగ్రెస్ ఘర్షణ: బిర్యానీ ప్లేట్లతో.. !!
రాత్రి బావర్చీ రెస్టారెంట్ లో బీఆర్ఎస్- కాంగ్రెస్ ఘర్షణ: బిర్యానీ ప్లేట్లతో.. !!

రాజ్యాంగ దినోత్సవం నాడే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల చం‍ద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుగా అనిపించట్లేదా అంటూ మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల రెండో దశ, పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ సందర్భంగా పోలీసులు, ప్రభుత్వాధికారులను ఉపయోగించుకుని తమ పార్టీ నేతలు, అభ్యర్థులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఇలా ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారా అంటూ నిలదీశారు.

ఎల్లుండి.. తిరుమల పార్వేట మండపంలో.. !!
ఎల్లుండి.. తిరుమల పార్వేట మండపంలో.. !!
  • అహోబిలంలో టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కాన్వాయ్‌లోని ఓ వాహనం వైసీపీ మద్దతుదారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అయిదుమంది గాయపడగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
  • మంగంపేటలో కూటమి మద్దతుదారులు పోలింగ్ ఏజెంట్లపై దాడి చేసి, ఓ ఏజెంట్ చేయి విరగ్గొట్టారు.
  • ప్రసన్నాయనపల్లిలో టీడీపీ నేతలు అధికారులను బెదిరించి బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు. నారసాంపల్లిలో ఇద్దరు వ్యక్తులు ఓటు పెట్టెల్లో సిరా పోయడంతో 2 వార్డుల్లో పోలింగ్ నిలిచిపోయింది.
  • వెల్లటూరులో టీడీపీ వర్గాలు పోలింగ్ కేంద్రాల తలుపులు మూసివేసి, పోలీసుల ముందే బయటి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించాయి.
  • మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలో పట్టపగలే ఓటర్లను పోలింగ్ కేంద్రాల నుంచి పదేపదే తిప్పుతూ బహిరంగంగా అక్రమాలకు పాల్పడ్డారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+