బీజేపీతో చేతులు కలపబోతున్న డీఎంకే ? డీలిమిటేషన్ బిల్లు వేళ టీవీకే కీలక సంకేతం..!

కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుల్ని ఆమోదింపజేసుకునేందుకు వచ్చే వారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నిర్వహణకు సిద్దమవుతోంది. దీంతో దేశంలో రాజకీయ పార్టీలన్నీ అలర్ట్ అవుతున్నాయి. గతంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో ఐక్యంగా ఉన్న విపక్షాలు.. ఇవే బిల్లుల్ని కేంద్రం నెగ్గించుకోకుండా అడ్డుకున్నాయి. దీంతో విపక్షాల్ని చీల్చి, ఎంపీల్ని తమవైపుకు తిప్పుకున్న బీజేపీ (BJP) ఈసారి ఎలాగైనా వాటిని నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఈ బిల్లులకు అడ్డుపడిన తమిళనాడు ప్రతిపక్షం డీఎంకేను (DMK) తమవైపు తిప్పుకుంటోంది.

కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి
కాంగ్రెస్ కు జగన్ వెన్నుపోటు-అందుకే నాకు నంబర్ 2 - బీజేపీ-వైసీపీ మధ్యవర్తిని: సాయిరెడ్డి

దీంతో ఈసారి డీలిమిటేషన్-మహిళా బిల్లులకు మద్దతు పేరుతో బీజేపీకి దగ్గరయ్యేందుకు డీఎంకే ప్రయత్నిస్తోందని, తాజాగా తమ ఎమ్మెల్యేపై ఫిర్యాదు పేరుతో గవర్నర్ తో విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ సమావేశం కావడమే ఇందుకు నిదర్శనమని అధికార టీవీకే వెల్లడించింది. అయితే టీవీకే వ్యాఖ్యల్ని డీఎంకే తోసిపుచ్చుతోంది. విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ గవర్నర్ తో భేటీలో ఎలాంటి ప్రత్యేకత లేదని, దీన్ని బట్టి బీజేపీకి డీఎంకే దగ్గరవుతున్నట్లు చెప్పడం సరికాదని వాదిస్తోంది. గవర్నర్ల వ్యవస్ధను గతంలో తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే.. ఇప్పుడు అదే గవర్నర్ కు వెళ్లి విజయ్ సర్కార్ పై ఫిర్యాదులు చేయడాన్ని టీవీకే ప్రశ్నిస్తోంది.

Will DMK Join Hands With BJP TVK s Big Claim Sparks Political Buzz amid delimitation bill row
పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహుర్తం ఫిక్స్- ఈ తేదీల్లో- మళ్లీ ఆ రెండు బిల్లులు..!
పార్లమెంట్ ప్రత్యేక భేటీకి ముహుర్తం ఫిక్స్- ఈ తేదీల్లో- మళ్లీ ఆ రెండు బిల్లులు..!

మరోవైపు డీఎంకే-బీజేపీ దోస్తీ వాదనకు మద్దతుగా తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించే డీఎంకే అధికార పత్రిక మురసోలిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇంటర్వ్యూ రావడం చర్చకు కారణమైంది. దీన్ని కూడా ప్రస్తావిస్తూ టీవీకే ఐటీ విభాగం.. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు డీఎంకే బాటలు పరుస్తోందని ఆరోపించింది. గతంలో డీఎంకే-బీజేపీ అనుబంధాన్ని కూడా అది గుర్తుచేస్తూ.. . చరిత్ర మళ్లీ పునరావృతం కాబోతోందని వ్యాఖ్యనించింది. గవర్నర్ల వ్యవస్ధ విషయంలో డీఎంకే తన వైఖరి మార్చుకుందని, ఇది ద్వంద్వప్రమాణం కాదా అని ప్రశ్నించింది. అయితే డీఎంకే మాత్రం ప్రస్తుత వ్యవస్ధలో రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదులు చేయాలంటే ప్రతిపక్షాలు గవర్నర్ ను ఆశ్రయించాల్సి ఉంటుందని సమర్దించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+