డీలిమిటేషన్ తో ఏపీలో సీట్లు పెరిగేది ఇక్కడే.. మహిళలకు ఇలా- కలిసొచ్చేదెవరికి..!!
దేశ రాజకీయాల్లో సంచలనం. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. లోక్ సభ తో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ల తో పాటుగా డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి.. ఆమోదం దిశగా తుది కసరత్త జరుగు తోంది. ఈ బిల్లు ఆమోదం పొందితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పార్లమెంట్ తో పాటుగా అసెంబ్లీ స్థానాలకు భారీగా పెరగనున్నాయి. అయితే.. అమలు 2029 కి సాధ్యామా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మహిళలకు ఇచ్చే సీట్ల పైనా స్పష్టత వస్తోంది.
కేంద్రం సంచలన నిర్ణయం అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ నెల 30న ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశం కానుంది. నాలుగు రోజుల పాటు జరిగే సభలో డీలిమిటేషన్ తో పాటుగా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే విధంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే లోక్ సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు 50 శాతం మేర పెరగనున్నాయి. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు 543 నుంచి 816కి పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నియోజకవర్గాలు 263కు తెలంగాణలో 179కి చేరతాయి. 2029 ఎన్నికల నుంచే నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసేందుకు తుది కసరత్తు జరుగుతోంది. దేశవ్యాప్తంగా 4,123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కి చేరతాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణలో ప్రస్తుత 119అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంది.

2029 ఎన్నికల నాటికి కొత్త సమీకరణాలు
అయితే.. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లులు తీసుకు రానున్నారు. లోక్‌సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయనుంది. చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తిచేసి 2029 ఎన్నికల్లో అమలు చేసే విధంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో ఎంపీ, అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉన్న వాటి కంటే 50 శాతం మేర పెరగనున్నాయి. మహిళలకు ఏపీలో లోక్ సభ 13, అసెంబ్లీ స్థానాలు 87 సీట్లు మహిళలకు కేటాయించనున్నారు. అదే విధంగా తెలంగాణలో మహిళలకు 9 లోక్ సభ, 60 అసెంబ్లీ స్థానాలకు దక్కనున్నాయి. ఎస్సీ, ఎస్టీ లకు రిజర్వేషన్ మేరకు సీట్లను ఖరారు చేయనున్నారు. దీంతో.. కేంద్రం అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2029 ఎన్నికల నుంచే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
