బౌలింగ్ స్టైల్ మార్చిన జస్‌ప్రీత్ బుమ్రా.. అయినా సరే
భారత్- న్యూజిలాండ్ మధ్య క్రైస్ట్‌చర్చ్ వేదికగా ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. న్యూజిలాండ్ ను తక్కువ పరుగులకే పరిమితం చేయాలని టీమిండియా బౌలర్లు భావించినప్పటికీ.. కథ అడ్డం తిరిగింది. ప్రారంభంలో వికెట్లు పడగొట్టినా ఆ తర్వాత చేతులెత్తేశారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. పటిష్ట స్థితికి చేరింది.
ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్, డెవాన్ కాన్వే బౌలింగ్ దాడిని జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. మొదటి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత 31 పరుగులు చేసిన కాన్వేను గుర్నూర్ బ్రార్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. అనంతరం కెప్టెన్ టామ్ లాథమ్- 59 పరుగులతో నిలకడగా బాధ్యతాయుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. లాథమ్ క్రీజ్ లో కుదురుకున్నా మరో వైపు వికెట్లు వెంటవెంటనే పడ్డాయి.

ఆకాష్ దీప్ బౌలింగ్ లో రచిన్ రవీంద్ర డకౌట్ కావడం, ఆ వెంటనే హెన్రీ నికోల్స్ పెవిలియన్ దారి పట్టడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్ కుదుపులకు లోనైంది. టామ్ లాథమ్, డారిల్ మిఛెల్- 31 కూడా అవుట్ కావడంతో 154 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది న్యూజిలాండ్.
ఆ పరిస్థితుల్లో వికెట్ కీపర్ టామ్ బ్లండెల్, ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. మరో వికెట్ పడగొట్టే అవకాశం బౌలర్లకు ఇవ్వలేదు. ఓపిగ్గా ఆడారు. ఈ క్రమంలో బ్లండెల్ హాఫ్ సెంచరీ సైతం పూర్తి చేసుకున్నాడు. 117 బంతుల్లో ఆరు ఫోర్లతో 53 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో అతనికి చక్కటి సహకారాన్ని అందించాడు గ్లెన్ ఫిలిప్స్. 64 బంతుల్లో అయిదు ఫోర్లతో ఫిలిప్స్ 36 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.
Jasprit Bumrah called it right all along! 💁♂️ Watch the HERO VIDA India Tour of New Zealand, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #NZvIND https://t.co/YnExKKSIUC
— Sony Sports Network (@SonySportsNetwk) November 27, 2026
భారత బౌలర్లలో ఆకాష్ దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు. గుర్నూర్ బ్రార్, అన్షుల్ కంబోజ్‌లతో పాటు వాషింగ్టన్ సుందర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ మ్యాచ్ లో అతను తన రెగ్యులర్ బౌలింగ్ స్టైల్ ను మార్చడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా అంపైర్ భుజాలకు సమాంతరంగా చెయ్యిని తిప్పడం అలవాటు జస్ ప్రీత్ బుమ్రాకు. ఈ మ్యాచ్ లో మాత్రం కాస్త భిన్నంగా బంతులు సంధించాడు. సాధారణ బౌలర్ లాగా చెయ్యిని నిటారుగా పైకెత్తి బంతులు వేశాడు.












Click it and Unblock the Notifications
