కోరంగి కొట్టుకుపోతేనే కాకినాడ ఎదిగింది? శవాల సాక్షిగా పురుడుపోసుకున్న పోర్ట్ కథ
అది అలలు రాసే పాతకాలపు జ్ఞాపకం కాదు... ప్రకృతి సృష్టించిన అతిపెద్ద రక్తాక్షరాల దస్తావేజు! ఈ రోజు మనం చూస్తున్న కాకినాడ మడ అడవుల కింద ఒకప్పటి ప్రపంచ ప్రసిద్ధ ఓడరేవు సమాధి అయి ఉందంటే నమ్ముతారా? కలకత్తా నుంచి శ్రీలంకలోని త్రికోణమలై వరకు నడిచే పెద్ద పెద్ద కమర్షియల్ షిప్స్ కు అప్పట్లో ఒకే ఒక్క పోర్ట్... కోరంగి! కానీ, కన్నుమూసి తెరిచేలోగా ఒక సమగ్ర నగర నాగరికతనే సముద్రం పొట్టనబెట్టుకుంది. భారతదేశ సముద్రయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన, విషాదకరమైన ఓడరేవు వినాశనం వెనుక ఉన్న భయంకర నిజాలు, హిడెన్ ఫ్యాక్ట్స్ ఇవే!
కోరంగి కథ..
ఈ రోజు మనం కాకినాడ మడ అడవులుగా చూస్తున్న కోరంగి ప్రాంతం 18వ శతాబ్దంలో ఒక అంతర్జాతీయ దిగ్గజ రేవు. ఇంజరం గ్రామంలో నేసిన అరుదైన పట్టు బట్టలు, ధాన్యపు రాశులు ఇక్కడి నుంచే ఐరోపా ఖండానికి ఎగుమతి అయ్యేవి. షిప్స్ ను బాగుచేసే అతిపెద్ద డ్రై డాక్స్ కలకత్తా తరువాత ఇక్కడే ఉండేవి.

మే 1787: 15 అడుగుల ప్రళయం
1787 మే నెలలో ఈశాన్యం నుంచి మొదలైన భయంకర గాలులు వారం రోజుల పాటు భీకరంగా వీచాయి. మే 20 ఉదయానికి సముద్రం నిశ్శబ్దంగా ముందుకొచ్చి, ఉదయం 11 గంటలకు ఒక్కసారిగా 15 అడుగుల ఎత్తున జలరాక్షసిలా ఊరిపై విరుచుకుపడింది.
నాటి ఘోరాన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక ఆంగ్లేయ అధికారి లండన్‌కు రాసిన అధికారిక లేఖలో ఒక భయంకరమైన నిజాన్ని రాశాడు "కోరంగి జనాభా దాదాపు 4,000 మంది. కానీ ఈ ప్రళయం ముగిసాక ప్రాణాలతో మిగిలింది కేవలం 20 మందే!" అంటే ఒక్క రోజులోనే 99.5% జనాభా తుడిచిపెట్టుకుపోయింది.
'రోబక్ డాక్' పునర్జన్మ (1802)..
మహా విపత్తు తర్వాత కూడా కోరంగి తన వ్యాపార వైభవాన్ని వదులుకోలేదు. 1802లో 'రోబక్ డాక్' (Roebuck Dock) పేరుతో కొత్త నౌకా నిర్మాణ కేంద్రాన్ని నిర్మించారు. మళ్లీ విదేశీ ఓడలు రాకపోకలు సాగించాయి. ఊరు కోలుకుంటుంది అనుకున్న తరుణంలో... ప్రకృతి మరోసారి కన్నుకుట్టింది.
అది 1839 నవంబర్ 16 రాత్రి. మళ్లీ సముద్రం మృత్యువుతో కలిసి దండయాత్ర చేసింది. హోప్ ఐలాండ్ లైట్‌హౌస్ తలుపులు ముక్కలైపోయాయి. మరుసటి రోజు ఉదయానికి ఐలాండ్‌పై శవాల దిబ్బలు తేలాయి. 40 టన్నుల బరువుండే పెద్ద పెద్ద ఓడలను సముద్ర అలలు మైళ్ల దూరంలోని అడవిలోకి విసిరేసాయి.
ఈ 1839 సైక్లోన్ ప్రభావంతో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏకంగా 20,000 కి పైగా ఓడలు ధ్వంసమయ్యాయని, దాదాపు 3,000,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ రికార్డులు చెబుతున్నాయి. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత నష్టాన్ని మిగిల్చిన మూడో అతిపెద్ద తుఫానుగా నమోదైంది.
పురుడుపోసుకున్న కాకినాడ పోర్ట్..
1839 విపత్తు తర్వాత కోరంగి కోలుకోలేకపోయింది. అపారమైన ఇసుక మేటలు రేవును శాశ్వతంగా మూసివేశాయి. సముద్రం వెనక్కి తగ్గుతూ కోరంగిని ఇసుక దిబ్బల కింద కప్పేసింది. దాంతో వ్యాపారం మొత్తం పక్కనే ఉన్న కాకినాడకు మారింది. ఈనాడు మనం చూస్తున్న కాకినాడ పోర్ట్... కోరంగి శవం మీద నిర్మించబడిన సామ్రాజ్యమే!
ఇది మన దేశంలోనే అతిపెద్ద రేవు పట్టణ వినాశనమా?
అవును! భారతదేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద సముద్ర నాశనం. గుజరాత్ లోని లోథాల్, తమిళనాడులోని పూంపుహార్, ధనుష్కోడి వంటి నగరాలు కనుమరుగైనప్పటికీ... ఆధునిక చారిత్రక రికార్డులు, బ్రిటీష్ డాక్యుమెంట్లు, ప్రత్యక్ష సాక్ష్యాల ఆధారాలు కలిగిన అతిపెద్ద సముద్ర ప్రళయ వినాశనం కోరంగిదే!
ఒకప్పుడు లక్షల టన్నుల సరుకుతో, వేలాది ఓడల సందడితో విలసిల్లిన కోరంగి నౌకాశ్రయం... నేడు నిశ్శబ్దంగా మడ అడవుల వేళ్ల కింద, సముద్రపు అడుగున జల సమాదైంది. కాకినాడ ఒడ్డున నిలబడి సముద్రం వైపు చూస్తే... అలల చప్పుడు కాదు, ఆ రోజే సముద్రంలో కలసిపోయిన వేలాది ఆత్మల ఆక్రందనలు వినబడతాయి!














Click it and Unblock the Notifications
