రామోజీ జయంతికి రాష్ట్ర పండుగా ? హైకోర్టులో మరో పిల్..!

రామోజీ గ్రూపు సంస్థల అధినేతగా వ్యవహరించిన దివంగత రామోజీరావు (Ramoji Rao) జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటిస్తూ కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయానికి షాకులు తప్పడం లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వరుస ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలవుతున్నాయి. ఇప్పటికే భారత చైతన్య యువజన పార్టీ (BCY) వ్యవస్థాపక అధ్యక్షుడు బోడె రామచంద్రయాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా.. ఇవాళ ప్రకాశం జిల్లాకు చెందిన మరొకరు కూడా పిల్ దాఖలు చేశారు.

ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలు..! వైసీపీతో పోలిస్తే కూటమికి భారీ ఎడ్జ్..!
ఏపీ పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలు..! వైసీపీతో పోలిస్తే కూటమికి భారీ ఎడ్జ్..!

ప్రతీ ఏటా నవంబర్ 16న రామోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా కూటమి సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆరోపిస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యాలు దాఖలవుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 243 చట్ట విరుద్దమని ప్రకటించి, దీన్ని రద్దు చేయాలంటూ హైకోర్టును తొలుత పిల్ దాఖలు చేసిన బోడె రామచంద్రయాదవ్ కోరారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలన్న బోడె లాయర్ విజ్ఞప్తితో హైకోర్టు నిన్న లంచ్ మోషన్ విచారణ చేపట్టింది. అయితే ప్రభుత్వ న్యాయవాదులకు ఈ పిల్ పై సమాచారం ఇవ్వలేదన్న కారణంతో పిటిషన్ పై విచారణ వచ్చే బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Ramoji Rao s Birth Anniversary as State Function Another PIL Challenges AP Government s Decision
టీడీపీ చేతిలో ఓడిన జనసేన నేత తల్లి..! ఇంకా ఎన్నికలెందుకని కన్నీళ్లపర్వం...!
టీడీపీ చేతిలో ఓడిన జనసేన నేత తల్లి..! ఇంకా ఎన్నికలెందుకని కన్నీళ్లపర్వం...!

ఈ నేపథ్యంలో ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నార్నే వెంకట సుబ్బయ్య ఇవే అంశాలతో మరో పిల్ దాఖలు చేశారు. రామోజీ జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా ప్రకటించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన ఈ పిల్ వేశారు. వార్షిక ఉత్సవాల నిర్వహణ కోసం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు జీవో నంబర్ 243ను చట్టవిరుద్ధమని ప్రకటించి, దానిని కొట్టివేయాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. రామోజీ రావు మరణం తర్వాత 2024 జూన్ 27న అధికారిక సంస్మరణ సభకు ప్రభుత్వం రూ.4.28 కోట్లు ఖర్చు చేయడాన్ని కూడా పిటిషనర్ వెంకట సుబ్బయ్య ప్రశ్నించారు. రామోజీ రావు సాంఘిక కార్యకర్త గానీ, స్వాతంత్ర్య సమరయోధుడు గానీ కాదని సుబ్బయ్య అభ్యంతరం తెలిపారు. ఈ పిటిషన్ ను బోడె రామచంద్రయాదవ్ పిటిషన్ తో కలిపి వచ్చే బుధవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+