సాగర్ జలాల కుట్ర ఆ ఆంధ్రా అధికారి వల్లే: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా కృష్ణా జలాల వినియోగంలో జరిగిన లోపాన్ని ప్రభుత్వానికి తెలియజేయకుండా ఏడాది పాటు ఓ అధికారి మౌనంగా ఉండిపోయారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. సంబంధిత ఎస్ఈ మల్లికార్జున్ ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించారని, దీని వెనుక పెద్ద కుట్ర ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

ఆ ఎస్ఈ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కావడం వల్లే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి అప్రమత్తం చేయలేదన్నది మంత్రి వాదన. ఇప్పుడు ఈ అంశం బయటపడిన వెంటనే తమ ప్రభుత్వం స్పందించిందని, ఇకపై ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

Minister Komatireddy venkat reddy Alleges Conspiracy Over Krishna Water Lapse due to an andhra man as official

నల్గొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడిన ఆయన, నాగార్జునసాగర్ జలాల విషయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని చెప్పారు. అలాగే జిల్లా సాగునీటి ప్రాజెక్టులపైనా కీలక హామీలు ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి, పిల్ల కాల్వల ద్వారా సుమారు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని, అదే సమయంలో జిల్లాను పీడిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు.

ఈ ఆరోపణలకు వెనుక పల్నాడు వాటర్ గ్రిడ్ వివాదం ఉంది. నాగార్జునసాగర్ సమీపంలో ఏపీ చేపడుతున్న ఈ పథకంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. నవంబర్ 16న కృష్ణా నదీ యాజమాన్య బోర్డును అధికారికంగా ఆశ్రయించింది. అయితే అనధికారికంగా నీటిని వాడుకుంటున్నామన్న ఆరోపణలను ఏపీ తోసిపుచ్చింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు దాదాపు ఏడాది పాటు ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు.

డిసెంబరులో నామినేటెడ్ పోస్తుల భర్తీ: సీఎం, పీసీసీ చీఫ్‌తో కాంగ్రెస్ ఇన్‌చార్జి వరుస భేటీలు!
డిసెంబరులో నామినేటెడ్ పోస్తుల భర్తీ: సీఎం, పీసీసీ చీఫ్‌తో కాంగ్రెస్ ఇన్‌చార్జి వరుస భేటీలు!

ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఈ పథకానికి సంబంధించిన జీవో 2022 ఫిబ్రవరిలో, అప్పటి ప్రభుత్వాల హయాంలో వచ్చిందని చెప్పారు.నల్గొండ ప్రాజెక్టుల విషయానికొస్తే, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ పనులను పూర్తి చేసి 2028 ఆగస్టు నాటికి దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తానని ఆయన గతంలో చెప్పారు. సాగర్‌లో నీటి నిల్వలు తగ్గడంతో అక్కడి నీరు 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకే సరిపోతుందని అంచనా వేశారు. అందుకే రైతులు వరికి బదులు తక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+