సికింద్రాబాద్ మీదుగా కొల్లం ప్రత్యేక రైలు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు: రేపు అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్
మండలం- మకరవిళక్కు యాత్రా కాలం ప్రారంభం కావడంతో శబరిమలలో వెలిసిన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివెళ్తోన్నారు ప్రజలు. డిసెంబర్ 27వ తేదీ వరకు మండలం, ఆ తర్వాత 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మకరవిళక్కు సీజన్ కొనసాగనుంది. ఈ యాత్రా కాలం ఆరంభం కావడంతో కేరళ పతనంతిట్ట కొండల్లో పండగ వాతావరణం నెలకొంది. వేలాదిమంది యాత్రీకులు స్వామివారిని దర్శించుకుంటోన్నారు.
ఈ క్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్- కొల్లం, హైదరాబాద్- కొల్లం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. డిసెంబర్ 4, 11 తేదీల్లో పట్టాలెక్కబోతోన్నాయి ఈ వీక్లీ ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైళ్లు. ఈ రైళ్లకు శనివారం ఉదయం 8 గంటలకు అడ్వాన్స్ టికెట్ బుకింత్ ఓపెన్ అవుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్- కొల్లం
- డిసెంబర్ 4, 18 తేదీల్లో ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరే నంబర్ 07187 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 4:55 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 5, 19 తేదీల్లో ప్రతి శనివారం సాయంత్రం 7:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07688 ప్రత్యేక రైలు రెండో రోజు రాత్రి ఉదయం 7 గంటలకు ఖాజీపేట్ కు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు హైదరాబాద్ కు బదులుగా ఖాజీపేట్ వరకు వెళ్తుంది.
- బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావళ్లిక్కార, కాయంకుళం, కరుణాగపల్లి, సస్థాన్ కోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
- తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ లోనే ఆగిపోదు. సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం మీదుగా ఖాజీపేట్ వరకు వెళ్తుంది.
సిర్పూర్ కాగజ్ నగర్- కొల్లం
- డిసెంబర్ 11, 25 తేదీల్లో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయలుదేరే నంబర్ 07171 ప్రత్యేక రైలు మరుసటి రోజు సాయంత్రం 4:55 నిమిషాలకు కొల్లం చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 12, 26 తేదీల్లో ప్రతి శనివారం సాయంత్రం 7:30 గంటలకు కొల్లం నుంచి బయలుదేరే నంబర్ 07172 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 4 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
- తిరుగు ప్రయాణంలో ఈ రైలు సిర్పూర్ కాగజ్ నగర్ వరకు వెళ్లదు. హైదరాబాద్ లోనే ఆగిపోతుంది.
- బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, ఖాజీపేట్, సికింద్రాబాద్, హైదరాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లి రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, పొదనూర్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం, కొట్టాయం, చంగనస్సేరి, తిరువళ్ల, చెంగన్నూర్, మావళ్లిక్కార, కాయంకుళం, కరుణాగపల్లి, సస్థాన్ కోట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.














Click it and Unblock the Notifications
