2027లో ప్రభుత్వ సెలవుల లిస్ట్ - ఈ సారి ప్రత్యేకంగా..!!
మరో నెల రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. 2027 లో ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంవత్సరపు సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. తప్పనిసరి సెలవులు, ఐచ్ఛిక సెలవులు, రెస్ట్రిక్టెడ్ సెలవులకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో స్పష్టంగా పేర్కొంది. బ్యాంకులకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు వర్తిస్తాయి. మొత్తం ఏడాది కాలంలో రానున్న సెలవుల విషయంలో ఈ సారి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పరిపాలనా కార్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన 2027 అధికారిక సెలవుల క్యాలెండర్ ను డీఎపీటీ విడుదల చేసింది. తప్పనిసరి సెలవులు, ఐచ్ఛిక సెలవులు, రెస్ట్రిక్టెడ్ సెలవులకు సంబంధించిన మార్గదర్శకాలను ఇందులో స్పష్టంగా పేర్కొన్నది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు 17 సాధారణ సెలవులు వర్తిస్తాయి. వీటికి అదనంగా ప్రతి ఉద్యోగి 32 రెస్ట్రిక్టెడ్ సెలవుల జాబితా నుంచి ఏవైనా రెండు సెలవులను ఎంపిక చేసుకోవచ్చు. ఢిల్లీ వెలుపల ఇతర రాష్ట్రాల్లోని కేంద్ర కార్యాలయాలకు 14 సెలవులను తప్పనిసరిగా ఖరారు చేశారు. మూడు జాతీయ సెలవులతో కలిపి గరిష్ఠంగా 16 సెలవులు అమలవుతాయి. నెలవంక దర్శనాన్ని బట్టి ఈద్-ఉల్-ఫితర్, బక్రీద్, మొహర్రం, మిలాద్-ఉన్-నబీ పండుగల తేదీలను మార్చే అధికారం సంబంధిత కమిటీలకు, కేంద్ర శాఖకు ఉంటుంది. 2027లో దీపావళి అక్టోబర్ 29న (శుక్రవారం) వచ్చింది.

సెలవుల జాబితా
సెలవుల జాబితాలో గణతంత్ర దినోత్సవం - జనవరి 26 (మంగళవారం), మార్చి 10 బుధవారం ఈద్-ఉల్-ఫితర్, మార్చి 23 (మంగళవారం) - హోలీ, మార్చి 26 (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 15 (గురువారం) - శ్రీరామనవమి, ఏప్రిల్ 19 (సోమవారం) - మహావీర్ జయంతి, మే 17 (సోమవారం) - ఈద్-ఉల్-జుహా (బక్రీద్), మే 20 (గురువారం) - బుద్ధ పూర్ణిమ, జూన్ 16 (బుధవారం) - మొహర్రం, ఆగస్టు 15 (ఆదివారం) - స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 15 (ఆదివారం) - మిలాద్-ఉన్-నబీ, ఆగస్టు 25 (బుధవారం) - శ్రీకృష్ణాష్టమి, అక్టోబర్ 2 (శని వారం) - మహాత్మా గాంధీ జయంతి, అక్టోబర్ 9 (శనివారం) - విజయదశమి, అక్టోబర్ 29 (శుక్ర వారం) - దీపావళి, నవంబర్ 14 (ఆదివారం) - గురునానక్ జయంతి, డిసెంబర్ 25 (శని వారం) - క్రిస్మస్ ఉన్నాయి. రాష్ట్రాల్లోని కార్యాలయాల కోసం 12 ఐచ్ఛిక సెలవులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications
