షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..!
దేశంలో ఓవైపు కేంద్ర ఎన్నికల సంఘంలో కమిషనర్ల మధ్య విభేదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో.. అంతకుమించిన షాకింగ్ పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో మార్పులు చేస్తూ కేంద్రం 2023లో తెచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరపకుండా ఆలస్యం చేస్తూ వస్తున్న సుప్రీంకోర్టు.. తాజాగా దీన్ని మరింత ఆలస్యం చేస్తూ రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించాలని నిర్ణయించింది. ఈ ధర్మాసనంలో జడ్జిగా ఉన్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ (Justice Satish Chandra Sharma) .. సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె అయిన నోయిడా కలెక్టర్ మేతా రూపమ్ .. నిరసనలు తెలిపిన ఓ యువతిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టుకు ఇచ్చిన ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చారు. ఈ రెండు వ్యవహారాలూ కలకలం రేపుతుండగా.. ఇవాళ మరిన్ని కొత్త అంశాలు తెరపైకి వచ్చాయి.
Lawyers Association For Constitution demands that the #SupremeCourt's orders referring the CEC Act challenge to the Constitution Bench, as well as giving interim relief to Noida DM Medha Roopam, be recalled in the light of reports that Justice Satish Chandra Sharma's son is a… pic.twitter.com/TGeGV2zMd8
— Live Law (@LiveLawIndia) September 25, 2026
ఎన్నికల కమిషనర్ల నియామకాల కేసు
ఎన్నికల కమిషనర్ల నియామకాలకు ఉన్న ముగ్గురు సభ్యుల కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కూడా ఉండగా.. 2023లో కేంద్రం సీజేఐను తొలగించి, ఆయన స్ధానంలో ప్రధాని నామినేట్ చేసిన కేంద్రమంత్రిని పెట్టింది. ఈ మేరకు పార్లమెంట్ లో చట్ట సవరణ చేసింది. దీంతో ప్రధాని మోడీ, అమిత్ షా, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కమిటీలోకి వచ్చారు. ఇందులో మెజార్టీ ప్రకారం ఇద్దరు సభ్యులు ఎంచుకున్న ఎన్నికల కమిషనర్లే నియమితులవుతున్నారు. రాహుల్ మాట చెల్లకుండా పోతోంది. దీన్ని సవాల్ చేస్తూ 2023లోనే పిటిషన్ దాఖలైనా మూడేళ్లుగా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని సుప్రీంకోర్టు... తాజాగా దీనిపై విచారణ జరిపింది. ఈ ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు జడ్జిల్లో ఒకరైన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరో జడ్జి జస్టిస్ దీపాంకర్ దత్తా అభిప్రాయంతో విభేదిస్తూ ఈ పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని తీర్పు ఇచ్చారు. దీంతో చేసేది లేక మరో జడ్జి దీపాంకర్ దత్తా కూడా రాజ్యాంగ ధర్మాసనానికి దీన్ని పంపేందుకు అంగీకరించారు. ఈ నిర్ణయంతో ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో మార్పుల కోసం కేంద్రం తెచ్చిన చట్టంపై విచారణ మరింత ఆలస్యం కాబోతోంది.

సీఈసీ జ్ఢానేష్ కుమార్తె మేధా రూపమ్ కేసు
సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుమార్తె, నోయిడా కలెక్టర్ గా ఉన్న మేధా రూపమ్ నోయిడాలో జరిగిన ఆందోళనల్లో పాల్గొందన్న కారణంతో ఆకృతి చౌదరీ అనే యువతిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టుకు ఆదేశాలు ఇచ్చారు. దీన్ని ఆమె అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై మండిపడ్డ హైకోర్టు.. కలెక్టర్ మేధ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐదు లక్షల జరిమానా విధించింది. అంతే కాదు దీన్ని ఆమె జీతం నుంచే చెల్లించాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. దీన్ని సీఈసీ కుమార్తె సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ విచారణ రోస్టర్ ప్రకారం అప్పటికే ఇలాంటి కేసులు విచారిస్తున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న బెంచ్ కు వెళ్లాల్సి ఉండగా.. దాన్ని ఉల్లంఘించి జూనియర్ అయిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్ కు పంపారు. అక్కడ ఆయన అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చారు. ఈ నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది.

The Madhya Pradesh High Court's website records that Justice Sharma's son, who enrolled in 2017, is the standing counsel for the Election Commission of India. He is also the standing counsel for the Central Board of Direct Taxes and the Income Tax Department. His younger son,…
— Prashant Bhushan (@pbhushan1) September 25, 2026
ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా సతీష్ చంద్ర కుమారుడు
మరోవైపు ఇదే సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ పెద్ద కుమారుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో భారత ఎన్నికల సంఘం తరఫున కేసులు వాదించే స్టాండింగ్ కౌన్సిల్ గా కూడా ఉన్నారు. ఆయన ఆదాయపు పన్ను శాఖ, సీబీడీటీలతో పాటు ఎన్నికల సంఘానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఆయన చిన్న కుమారుడు సైతం స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు స్టాండింగ్ కౌన్సిల్‌గా ఉన్నారు. అంటే కుమారుడు ఎన్నికల సంఘం న్యాయవాది, తండ్రి ఎన్నికల ప్రధాన కమిషనర్ కుమార్తెకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు, అదే ఎన్నికల కమిషన్ లో తలెత్తిన వివాదాన్ని ఆలస్యం చేసేలా పిటిషన్ ను రాజ్యాంగ ధర్మాసనానికి పంపారు. అంటే పరస్పర విరుద్ద ప్రయోజనాల కింద ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక సంస్థతో జడ్జి కుటుంబ సభ్యులకు వృత్తిపరమైన ప్రయోజనాలు ఉన్నప్పుడు, అలాంటి కేసుల విచారణకు దూరంగా ఉండాలనేది న్యాయ సూత్రం. సదరు విచారణల సమయంలో జస్టిస్ శర్మ తన కుమారులకు ఎన్నికల సంఘంతో ఉన్న ఈ వృత్తిపరమైన సంబంధాల గురించి ఇతర పక్షాలకు వెల్లడించారా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు.















Click it and Unblock the Notifications
